మొన్నటి వరకు కేవలం అమెరికాతో మాత్రమే ఉన్న శత్రుత్వం జో బైడెన్ వచ్చిన తర్వాత అది కాస్త తగ్గుముఖం పట్టిందని అనుకుంటున్న చైనాకు ఇటీవలే ఆస్ట్రేలియా ఇచ్చిన వార్నింగ్ కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టేలా కనిపిస్తుంది. 5జి టెక్నాలజీ విషయంలో చైనాకు అమెరికా షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.5జి టెక్నాలజీకి సంబంధించిన హువాయ్ కంపెనీ చైనా లో ఉండడం వలన తమ దేశంలో సదరు 5జి నెట్వర్క్ అనుమతించటం లేదు అంటూ మిత్ర దేశాలతో సందేశాన్ని పంచుకుంది అమెరికా . ఇక ఇలాంటి క్రమంలోనే ఆస్ట్రేలియా కూడా కీలక నిర్ణయం తీసుకుంది.
ఆస్ట్రేలియా కూడా అమెరికా తరహ నిర్ణయం తీసుకొని ఇటీవలే ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు. దీంతో వెంటనే స్పందించిన చైనా విదేశాంగశాఖ చైనాను శత్రువుగా భావిస్తే చైనా శత్రు గానే ఉంటుంది అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దీనిపై తీవ్రంగా స్పందించింది ఆస్ట్రేలియా. మా జాతి ప్రయోజనాలకు అనుగుణంగా మా చట్టాలు ఉంటాయి. మా సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉందని... విదేశీ పెట్టుబడుల విషయంలో ఎలా వ్యవహరించాలన్నది మాకు తెలుసు.. నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది అంటూ ఆస్ట్రేలియా ప్రధాని చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారూ.