పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. వివాహానికి వెళ్లిన ఓ మహిళ ఇంట్లో చొరబడి భారీగా బంగారం, నగదు, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. వీటి విలువ దాదాపు రూ. కోటి వరకు ఉంటుందని బాధితురాలు తెలుపుతోంది. కృష్ణాజిల్లాలోని పమిడిముక్కల మండలం గురజాకుడు చెందిన రాజేశ్వరీ అనే మహిళ ఇంట్లో దొంగలు చొరబడ్డారు. ఈమె హైదరాబాద్ లోని తన సోదరుడి ఇంట్లో శుభకార్యం నిమిత్తం ఈ నెల19న వెళ్లింది..ఈ నెల 23న వచ్చే చూసే సరికి ఇళ్లంతా చిందరవందర..ఎక్కడి సామన్లు అక్కడ పడేసున్నాయి. బీరువాలోని వెండి, బంగారం, నగదు అంతా చోరికి గురైనట్లు బాధితురాలు పేర్కంది. లబోదిబో మంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
బాధితురాలు ఫిర్యాదు మేరకు.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఉయ్యూరు సీఐ నాగప్రసాద్ తన సిబ్బందితో కలిసి విచారణ చేపట్టారు. క్లూస్ టీం ఆధారంగా వేలి ముద్రలు సేకరించారు. నేరస్థులను పట్టుకునేందురు మూడు బృందాలు గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చోరీకి గురైన బంగారు ఆభరణాలు ఒక కేజీ కి పైగా ఉండవచ్చని, వెండి వస్తువులు 10 కేజీలు ఉంటాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. చోరీకి గురైన మొత్తం సోత్తు విలువ సుమారు రూ. కోటి రూపాయల వరకు ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు.
ఈ భారీ దొంగతనంతో స్థానికులు భయబ్రాంతులకు గురవతున్నారు. చోరీకి పాల్పడిన వారిని వెంటనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.. అసలే బంగారం రేటు రోజురోజుకు పెరిగిపోతుంది..ఈ సమయంలో ఇంత మొత్తంలో నగదు చోరీకి గురవడంటో బాధిత మహిళ విలపిస్తోంది. నేరస్థులను త్వరితగతిన పట్టుకుని తన సొమ్ము తిరిగి ఇప్పించాలని పోలీసులును కోరింది.