కాగా ఇటీవలే కీలక నిర్ణయం తీసుకున్న గూగుల్ పే వినియోగదారులందరికీ ఝలక్ ఇచ్చింది. గూగుల్ పే ద్వారా డబ్బులు పంపిస్తే మాత్రం తప్పనిసరిగా చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ ఎవరికైనా గూగుల్ పై నుంచి డబ్బులు పంపించాల్సి వచ్చినప్పుడు ఎలాంటి చార్జీలు లేకుండానే డబ్బులు పంపడం సాధ్యం అయ్యేది. కానీ ఇకపై ఇలాంటివి అస్సలు కుదరదు. ఇక ప్రస్తుతం ఉచితంగా పేమెంట్స్ చేసుకునే ఫెసిలిటీ నిలిపివేసేందుకు గూగుల్ పే ప్లాట్ఫాం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2021 జనవరి నుంచి ఈ సరికొత్త నిర్ణయం అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక అప్పటినుంచి గూగుల్ పే ఇన్స్టెంట్ మనీ ట్రాన్స్ఫర్ పేమెంట్ సిస్టం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గూగుల్ పే ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఈ సరికొత్త పేమెంట్ సిస్టం ద్వారా గూగుల్ పే నుంచి ఎవరైనా యూజర్లు మనీ ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ సరికొత్త పేమెంట్ ఆప్షన్ పై ఏ మొత్తంలో చార్జీలు విధించ బోతున్నారు అనేదానిపై మాత్రం గూగుల్ పే స్పష్టత ఇవ్వలేదు. ఇక ప్రస్తుతం గూగుల్ పే మొబైల్ యాప్ ద్వారా డబ్బులు పంపించడం స్వీకరించడం ఇలాంటి సేవలను అందిస్తోంది గూగుల్ పే. ప్రస్తుతం గూగుల్ తీసుకున్న కొత్త నిర్ణయం మాత్రం కేవలం వెబ్ యాప్ కి మాత్రమే వర్తిస్తుంది అన్నది అర్ధమవుతుంది. దీంతో గూగుల్ పే వినియోగదారులకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది అన్నది మాత్రం తెలుస్తుంది.