అదే సమయంలో తైవాన్ పై కూడా ఆధిపత్యం సాధించి అక్కడి ప్రజలను చిత్రహింసలకు గురి చేయడానికి ఎన్నో రోజుల నుంచి చైనా ప్రయత్నిస్తూనే ఉంది. అయితే తైవాన్ చిన్నదేశం అయినప్పటికీ తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు ఏకంగా చైనా కు దీటుగా నిలబడేందుకు సిద్ధం అవుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తైవాన్ ను సొంతం చేసుకునేందుకు చైనా రోజు రోజు మరింత నీచమైన చర్యలకు పాల్పడుతునే ఉంది ఇక ఇటీవల మరోసారి తైవాన్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది చైనా.
ఇటీవలే డై హార్డ్ తైవాన్ సపోర్టర్స్ మీద యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమయింది చైనా. డై హార్డ్ తైవాన్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ బ్లాక్లిస్టులో పెడుతూ కీలక నిర్ణయం తీసుకుంది చైనా. తైవాన్ చైనాలో భూభాగం అని ఒప్పుకోని వారందరినీ బ్లాక్లిస్టులో పెట్టింది చైనా. ఏకంగా తైవాన్లో ప్రజల చేత ఎన్నుకోబడిన అధ్యక్షురాలు ని కూడా ఇలా బ్లాక్ లిస్టులో పెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. ఇలా తమ దేశంలో ప్రజల హక్కులను హరించే చైనా ప్రస్తుతం తైవాన్ విషయంలో హక్కులను గుర్తు చేస్తూ ఎంతో మంది ని బ్లాక్ లిస్టులో పెట్టడం మాత్రం ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం విస్మయానికి గురి చేస్తుంది.