ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. జిహెచ్ఎంసి ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అన్ని పార్టీలు. ఈ క్రమంలోనే ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రచారం నిర్వహించి ఓటర్లను ఆకట్టుకునేందుకు కొన్ని రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న కొంత సమయాన్ని కూడా ప్రచారం కోసం పూర్తిస్థాయిలో వినియోగిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నాయి అన్ని పార్టీలు.



 ఈ క్రమంలోనే బిజెపి ఎట్టి పరిస్థితిలో జిహెచ్ఎంసి ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఏకంగా ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్య నేతలు సైతం కదలి వస్తున్నారు. ఏపీ బీజేపీ నేతలు సహా జనసేన నేతలు కూడా బీజేపీకి అనుకూలంగా ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అదేసమయంలో ఢిల్లీ పెద్దలు కూడా ప్రస్తుతం రంగంలోకి దిగి బిజెపి తరఫున జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు అన్న ప్రచారం కూడా ప్రస్తుతం జరుగుతుంది. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ స్థాయి నేతలు కూడా ఎన్నికల ప్రచారం కోసం రాబోతున్నారు అనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇది కాస్త చర్చనీయాంశంగా మారిపోయింది.



 తాజాగా ఇదే విషయంపై మాట్లాడినా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బిజెపి టిఆర్ఎస్ ల పై విమర్శలు గుప్పించారు. గల్లీ  ఎలక్షన్స్ కోసం కేంద్ర మంత్రులు అందరూ బరిలోకి దిగి ప్రచారం కోసం వస్తూ ఉండడం విడ్డూరంగా ఉంది అంటూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. హైదరాబాద్ కి మెట్రో రింగ్ రోడ్ ఎయిర్ పోర్టు వంటివి అన్నీ కూడా కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయని కానీ ప్రస్తుతం టీఆర్ఎస్ అన్ని తామే  చేశాము అని చెప్పుకుంటుంది అంటూ విమర్శించారు. ఎన్నికల నేపథ్యంలో మత ఘర్షణలు జరుగుతాయన్న సమాచారం ఉంటే ముఖ్యమంత్రి వెంటనే వారిని అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: