జాంభాగ్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎం.ఆనంద్‌కుమార్‌ గౌడ్‌ విస్తృత ప్రచారం చేపట్టారు. గ్రేటర్ ఎన్నికల్లో తెరాస గెలుపు ఖాయమని టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు మహ్మద్‌ ఇస్మాయిల్‌ అన్సారీ అలియాస్‌ ఉర్దూ అన్సారీ ధీమా వ్యక్తం చేశారు. శనివారం అజెంతా గేటు వద్ద జరిగిన పార్టీ సమావేశానికి విచ్చేసిన ఆయన ప్రసంగించారు. టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని చెప్పారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎం.ఆనంద్‌కుమార్‌ గౌడ్‌  లౌకిక భావాలున్న వ్యక్తి అన్నారు. ప్రజలందరికి అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. డిసెంబరు 1న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ ఇన్‌ఛార్జి సుధీర్‌ కుమార్, టీఆర్‌ఎస్‌ నేతలు డాక్టర్‌ సుజాత్, సయ్యద్‌ మోసిన్‌ అహ్మద్, నందూ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ గౌడ కులస్థులను అన్నివిధాలుగా ఆదుకుని వారి ఎదుగుదలకు పూర్తి సహాయ సహకారాన్ని అందించారని వరంగల్‌ జిల్లా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం పురానాపూల్‌లో గీతా పారిశ్రామిక సహకార సంఘం (పూలేకోన) అధ్యక్షులు కొత్త నవీన్‌కుమార్‌ గౌడ్, ప్రధాన కార్యదర్శి నిర్మల నీలకంఠం గౌడ్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటైన టీఆర్‌ఎస్‌ పార్టీకి పూర్తి సంఘీభావన మద్దతు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.... కేసీఆర్‌ ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు ఎక్స్‌గ్రేషియాను రూ.2 లక్షల నుండి రూ.5 లక్షలకు పెంచడంతో పాటు కల్లు చెట్ల పన్నును కూడా పూర్తిగా రద్దు చేశారు. రూ.150 కోట్ల నిధులతో కోకాపేట్‌లో స్థలం కేటాయించి భవన నిర్మాణం పనులను చేపట్టారన్నారు.

ఇక సంఘం అధ్యక్షులు కొత్త నవీన్‌కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ.... గీతా పారిశ్రామిక సహకార సంఘం పూలేకోన పరిధిలోని గోషామహాల్, కార్వాన్‌ నియోజకవర్గాలలో గల డివిజన్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు గౌడ సంఘాలు, గౌడ కులస్థులు ప్రతి ఒక్కరు టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘాల సమన్వయ కమిటీ అధ్యక్షులు బాలగౌని బాల్‌రాజ్‌ గౌడ్, ఐలి వెంకన్న గౌడ్, ఎలికేటి విజయ్‌కుమార్‌ గౌడ్, అంబాల నారాయణ గౌడ్, సంఘం ఉపాధ్యక్షులు బొర్ర భాస్కర్‌ గౌడ్, వెంకన్న గౌడ్, నరేష్‌ గౌడ్, సందీప్‌ కుమార్‌ గౌడ్, అశోక్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: