ఆ తర్వాత ఇరు దేశాలు వెనక్కి తగ్గలని ఒప్పందం కుదిరినప్పటికీ ఇరుదేశాలు వెనక్కి తగ్గకపోవడంతో ప్రస్తుతం సరిహద్దుల్లో పరిస్థితి అలాగే ఉంది. అయితే గడ్డకట్టుకుపోయే చలిలో ఇరుదేశాల సైనికులు ఎదురుబొదురు గా నిలబడి ప్రస్తుతం పహారా కాస్తున్నారు. ఈ సమయంలో రోజురోజుకు అక్కడికి మొహరింపు కూడా ఎక్కువ అవుతూ ఉన్నది అనేది విషయం తెలుస్తుంది. ఇక సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న భారత... చైనా సరిహద్దుల్లో మరింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల యుద్ధంలో ఎంతో సిద్ధహస్తులైన మార్కోస్ టీమ్ ని సరిహద్దుల్లోకి రప్పించడం ప్రస్తుతం మరింత సంచలనంగా మారిపోయింది.
సముద్ర గర్భంలోకి చేరి శత్రువుల నౌకలకు బాంబులు పెట్టగల సామర్థ్యం కలిగిన మార్కోస్ టీము ప్రస్తుతం పాంగ్వాన్ సరస్సు వద్దకు చేర్చింది భారత్. అయితే ఇలా మార్కోస్ టీమ్ ను సరిహద్దు లోకి చేర్చడం ద్వారా భారత్ మరింత పటిష్టంగా మారడంతో పాటు... గడ్డకట్టుకుపోయే చలిలో..మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో మార్కోస్ కి ఒక శిక్షణ లాంటివి కూడా లభిస్తుంది అనే ఉద్దేశంతోనే ప్రస్తుతం మార్కోస్ ని సరిహద్దుల్లోకి రప్పించింది విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనేది చూడాలి.