ఈ మేరకు ఎక్కడిక్కడ పోలీసులు అల్లర్లు జరగకుండా చర్యలు తీసుకున్నా కూడా ఇలాంటి ఘటనలు జరగడం ప్రజలను ఆలోచనలో పడేశాయి..నగరంలోని దాదాపు ఏడెనిమిది చోట్ల తమకు అలవాటైన పాత పద్ధతుల్లో స్ట్రీట్‌ఫైట్లకు తెరతీశారు. ఒకవైపు తమ శ్రేణులతో కాలనీల్లో, బస్తీల్లో డబ్బుల పంపిణీ ప్రారంభించారు. మరోవైపు హైదరాబాద్‌లోని పలు అపార్ట్‌మెంట్లలో విందు సమావేశాలను ఏర్పాటుచేసి ప్రలోభాలకు పాల్పడుతున్నారు. పైగా అందరి దృష్టిని మళ్లించడానికి టీఆర్‌ఎస్ శ్రేణులు డబ్బులు పంచుతున్నారంటూ కొత్త లోల్లికి తెరతీశారు.
నగరంలోని పలు ప్రాంతాల్లో నిన్న జరగిన చివరి ప్రచారం కాషాయం నేతలు అసభ్య పదజాలంతో పాటుగా, మహిళా కార్యకర్తల పై దాడులు చేశారు. పలు డివిజన్లలో బీజేపీ కార్యకర్తలు దౌర్జన్యకాండ సాగించారు. కొన్నిచోట్ల టీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడిచేసి, గాయపరిచి ఉద్రిక్తత సృష్టించడానికి యత్నించారు. అయితే ఎలాంటి ఘటనలు జరిగినా కూడా సమన్వయం పాటించాలని అధిష్టానం కోరడం తో నేతలు పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు ఒడిపోతామనే భయంతో బండి సంజయ్ పోలీసుల పైనే దాడికి దిగారు.కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నదని గుర్తుంచుకోండని హెచ్చరించారు. మీ దగ్గర స్టేట్ ఇంటెలిజెన్స్ ఉంటే.. మాకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉన్నదని బెదిరించారు.. ఇవన్నీ కూడా ఎన్నిక పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి తెలుస్తుంది..