ఏపీ లో అసెంబ్లీ సమావేశాల రగడ ఇంకా ఆగనేలేదు.. రోజుకో అంశంతో అసెంబ్లీ నిర్వహణ సాగగా ప్రతి దాంట్లో టీడీపీ వైసీపీ ని, జగన్ టార్గెట్ చేస్తూ అసెంబ్లీ ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తుంది. దాంతో స్పీకర్ వరుసగా మూడో రోజు కూడా టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేశారు..మొత్తం ఐదు రోజుల సమావేశాల్లో మొదటి మూడు రోజులు టీడీపీ సభ్యులు సస్పెన్షన్ కి గురయ్యారు. అడ్డగోలు వాదనతో జగన్ ను ఇబ్బంది పెడుతున్నారని ఆ పార్టీ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ సస్పెన్షన్ లు జరుగుతున్నాయి. మొదటి రోజు పంటల భీమా ప్రీమియం పై ఏపీ సర్కార్ ఇబ్బంది కర పరిస్థితులని ఎదుర్కోవడంతో టీడీపీ సభ్యులందరినీ సస్పెండ్ చేశారు..

రెండో రోజు టిడ్కో ఇళ్ల మీద జరిగిన చర్చల్లో, మూడో రోజు అంటే నిన్న పోలవరం మీద జరిగిన చర్చల్లో అర్థంలేని వాదనలు వినిపిస్తున్న టీడీపీ సభ్యలను స్పీకర్ సస్పెండ్ చేశారు. చంద్రబాబు హయాంలో అసలు పనులేమీ జరగలేదని చెబుతూండటంతో.. ప్రభుత్వ నివేదికల్ని బయట పెట్టాలని టీడీపీ సభ్యులు అనుకున్నారు. అయితే.. జగన్ ప్రసంగానికి అడ్డు తగిలారంటూ.. సస్పెండ్ చేసేశారు. అయితే సభ్యులను బయటకి పంపి ప్రసంగం ఇచ్చేకంటే వారిని వారిస్తూ నిజాయితీ నిరూపించుకుంటే ప్రభుత్వానికే మంచిది అంటూ కొంతమంది విశ్లేషకులు అంటున్నారు..

ఇక టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలన్న సూచనలు ప్రతీ సారి ముఖ్యమంత్రి జగన్ నేరుగా చేస్తున్నారు. అదీ కూడా ఆయన స్పీకర్ ను ఆదేశిస్తున్నట్లుగా చెబుతున్నారు. పది నిమిషాల్లో ఎవరి సీట్లలో వారు కూర్చోకపోతే.. సస్పెండ్ చేసి.. మార్షల్స్ తో ఈడ్చి పడేయాలని సలహాలిస్తున్నారు. దాని ప్రకారం.. అసెంబ్లీ వ్యవహారాల మంత్రి తీర్మానం పెడుతున్నారు.ఏకపక్షంగా ప్రభుత్వం తమ వాదనలు వినిపిస్తే అందులో నిజాయితీ తో పాటు నిజం కూడా కనపడదు కాబట్టి వారిని అసెంబ్లీ లో ఉంచి బుద్ధి చెప్పాలి అని కార్యకర్తలు కోరుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: