సాధారణంగా ఎవరైనా భారీగా డబ్బులు సంపాదించాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు అయితే కొంతమంది ఇలా కలలుగన్న దాన్ని నిజం చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే లక్షాధికారులు కావడం అంటే కాస్త సులభమే కావచ్చు గానీ కోటీశ్వరులు కావడం మాత్రం కాస్త కష్టమైన పని అన్న విషయం తెలిసిందే. అయితే కోటీశ్వరులు కావడం మాత్రం అందరికీ సాధ్యమయ్యే పనికాదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ గట్టిగా తలుచుకుని పట్టుదలతో పని చేస్తే మాత్రం కోటీశ్వరులు కావడం పెద్ద కష్టమేమి కాదు అన్నది ఈ రోజుల్లో ఎంతోమంది నిరూపిస్తున్నారు. ప్రస్తుతం డబ్బు సంపాదించటానికి ఎన్నో మార్గాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.



 దీనికోసం ప్రత్యేకంగా ఎన్నో డబ్బులు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా లేదు చేతిలో ఉన్న డబ్బుతోనే కోటీశ్వరులు అయ్యేందుకు అవకాశం ఉంటుంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు ప్రతినెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. దీర్ఘకాలిక ఇన్వెస్టింగ్ ద్వారా మీ కల  సహకారం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా ఈ అవకాశం లభిస్తోంది ఇప్పటికే ఎంతోమంది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా భారీగా ఆదాయం పొందుతున్నారు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్పై ఏకంగా 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. ఇక అంతే కాకుండా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్ళు.




 మరింత ఎక్కువగా ప్రయోజనం పొందడానికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ యొక్క మెచ్యూరిటీ కాలాన్ని మరింత పొడిగించుకుంటూ వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాదు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను మినహాయింపు కూడా పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే మీరు 25 ఏళ్ల వయసు నుంచే పబ్లిక్ ప్రావిడెంట్ లో డబ్బులు పెట్టాల్సి ఉంటుంది 35 ఏళ్లపాటు చేయాలి. ప్రతినెల ఆరువేల రూపాయలు చేస్తూ వస్తే మెచ్యూరిటీ కాలం తర్వాత కోటి రూపాయల వరకూ పొందేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఎంతో మంది పబ్లిక్ ప్రావిడెంట్ ద్వారా వచ్చే ప్రయోజనం పొందుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: