ఇప్పటి వరకు రాజకీయ పార్టీ పెడతారా లేదా అనే విషయంలో సస్పెన్స్ పెడుతూ వచ్చిన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, ఎట్టకేలకు పార్టీ ప్రారంభించబోతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేశారు. దీంతో తమిళనాడు రాజకీయాల్లో ఎన్నో సంచలనాలు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇది ఇలా ఉంటే రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టడాన్ని స్వాగతించారు. రజిని రాజకీయాల్లో అడుగు పెట్టడం సంతోషించదగ్గ విషయం అని, ఆయన సినిమాల్లో మాదిరిగా రాజకీయాల్లో రాణించాలని, ప్రజాస్వామ్యంలో కి కొత్త పార్టీలు రావడం సహజం అంటూ టిడిపి అధినేత చంద్రబాబు స్పందించారు.
ఇక
జనసేన అధినేత
పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంపై స్పందించారు.
రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఎప్పటి నుంచో ఆరాట పడుతున్నారని, ఆయన రాజకీయాల్లోకి రాకపోయినా, గతంలో
పార్టీ గెలుపు కోసం కృషి చేశారని, ప్రత్యక్షంగా కాకపోయినా , పరోక్షంగా ఎప్పటి నుంచో రజనీ రాజకీయాల్లో ఉన్నారు అంటూ
పవన్ వ్యాఖ్యానించారు.రజినీ కి విపరీతమైన అభిమానుల బలం ఉందని , తప్పకుండా ఆయన రాజకీయాల్లో రాణిస్తారు అంటూ
పవన్ జోస్యం చెప్పారు.
జనవరిలో తన పొలిటికల్ ఎంట్రీ ఉండబోతుంది అంటూ
పవన్ వ్యాఖ్యానించడం తో ఆయన ఇక రాజకీయ నాయకుడిగానే అందరికీ కనిపించబోతున్నారు. ఇది ఇలా ఉంటే రజనీ రాజకీయం గా
సక్సెస్ అవుతాడా లేదా ? రాజకీయాల్లో ఎలా నెగ్గుకురాగలరా అనే టెన్షన్
జనసేన అధినేత
పవన్ కళ్యాణ్ లో ఎక్కువగా కనిపిస్తోందట దీనికి కారణం తనకు పెద్ద ఎత్తున అభిమానులు, సామాజికవర్గ బలం అన్నీ ఉన్నా , రాజకీయంగా
సక్సెస్ కాలేక పోయారు అని , ఇప్పుడు రజిని ఏ విధంగా
సక్సెస్ అందుకుంటాడు ? ఒకవేళ
సక్సెస్ అందుకుంటే ఆ ప్రభావం
జనసేన పై ఎంత వరకు ఉంటుంది అన్ లెక్కల్లో
పవన్ ఉన్నట్లు తెలుస్తోంది.