ఎన్నికలు అంటే చాలు సర్వేల పేరిట చాల సంస్థలు పార్టీ ల భవిష్యత్ నిర్ణయంచడానికి రెడీ అయిపోతుంటాయి.. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ప్రజలు ఏ పార్టీ కి ఓట్లు వేశారో కూడా తెలీదు పాలనా పార్టీ అధికారంలోకి వస్తుంది.పాలన పార్టీ పాతాళంలోకి వెళుతుందని జోస్యం చెప్తున్నారు. అంతేనా అక్కడికేదో వారే లెక్కపెట్టినట్లు ఈ పార్టీ ఇన్ని సీట్లు గెలుస్తుంది.. ఈ పార్టీ ఇన్ని సీట్ల కన్నా ఎక్కువగా గెలవదు  అని ప్రజలను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు..

ఇక ఎన్నికలు పూర్తయ్యాక ఎగ్జిట్ పోల్స్ తో చేసే హడావుడి అంతా ఇంతా కాదు.. నిజంగా ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తే నిజమైన పోలింగ్ ఫలితాలు కూడా తప్పేమో అనిపించేలా ఉంటాయి.. ఇక గ్రేటర్ ఎన్నికల్లో ఈ ఫలితాలు వెల్లడించే సంస్థలు పెద్ద ఫూల్స్ అయ్యాయని ప్రజలు నిరూపించారు.  ఆ పోల్స్ కి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేసి అందరికి షాక్ ఇచ్చారు.. గ్రేటర్ ఎన్నికల్లో ముగిసిన వెంటనే… ఆరా నుంచి పీపుల్స్ పల్స్ అంటూ..అనేక ఊరూపేరూ లేని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. అన్నింటిలోనూ టీఆర్ఎస్‌కే అగ్ర తాంబూలం ఇచ్చారు. కొన్ని సర్వేలు అయితే… కేటీఆర్, కేసీఆర్ ఎక్కడ ఇబ్బంది పడతారోనన్నట్లుగా ఏకంగా 101 సీట్లు కూడా ఇచ్చాయి.

కానీ చివరికి ప్రజాభిప్రాయాన్ని ఎవరూ అంచనా వేయలేకపోయారు. హోరాహోరీగా సాగిన ఫలితాల్లో…టీఆర్ఎస్ నాలుగైదు సీట్లు ఎక్కువ తెచ్చుకున్నా… ఘోరపరాజయం కిందనే లెక్క తేలుతోంది. ఇంత దారుణమైన ఫలితాల్ని ఏ సర్వే సంస్థ అంచనా వేయలేదు. తెలంగాణలో ఉన్న సర్వే సంస్థలన్నీ ఏ మాత్రం వనరులు లేని.. సింగిల్ షట్టర్‌లో ఉండే సంస్థలే. ఆయా పార్టీల వద్ద డబ్బులు తీసుకుని వారికి తగ్గట్లుగా సర్వే ఫలితాలు ప్రకటించడంలో రాటుదేలిపోయాయి. ఇప్పుడు ఆ విషయం నిరూపితమయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: