ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు తో ఆస్ట్రేలియా జట్టు వరుసగా వన్డే టి20 టెస్ట్ సిరీస్ లు ఆడుతుంది అన్న విషయం తెలిసిందే.అయితే మొదటి నుంచి ఆస్ట్రేలియా జట్టుకు విజయం సాధిస్తున్నప్పటికీ  వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి.మొదట టీమిండియా తో వన్డే సిరీస్ ఆడింది  భారత జట్టు ఈ క్రమంలోనే...  ఆస్ట్రేలియా బ్యాట్ మెన్స్ అందరూ కూడా అద్భుతంగా రాణించడంతో రెండు మ్యాచ్లలో ఘన విజయాన్ని అందుకుంది.ఈ క్రమంలోనే ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా జట్టు.




 ఇక ఆ తర్వాత మూడో మ్యాచ్లో భారత్ విజయం సాధించి పరువు నిలుపుకుంది అన్న విషయం తెలిసిందే.ఇక నిన్న ఆస్ట్రేలియా భారత్ మధ్య తొలి టి20 సిరీస్ ప్రారంభమైంది ఈ క్రమంలోనే భారత్-ఆస్ట్రేలియాల మధ్య తొలి మ్యాచ్ జరుగగా.. మొదటి టీ20 మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. కాగా ఆస్ట్రేలియా జట్టులో వరుసగా ఆటగాళ్లు గాయాల బారిన పడుతూ జట్టుకు దూరం అవుతూ ఉండటం ఆస్ట్రేలియా జట్టును మరింతగా వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ముగ్గురు ఆటగాళ్లు గాయం బారిన పడి జట్టుకు దూరమయ్యారు.  ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టుకు నాలుగో  ఎదురు దెబ్బ తగిలింది.



 వన్డే సిరీస్లో సెంచరీతో అదరగొట్టిన మళ్లీ పాత ఫామ్లోకి వచ్చిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ ఫించ్.. టి20 లో 26 బంతుల్లో 35 పరుగులు చేశాడు.  ఇకటి20 మ్యాచ్ లో కూడా ఆరోన్ ఫించ్ జట్టును ముందుండి నడిపించాడు. అయితే మొదటి టి20 మ్యాచ్ లో భాగంగా ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ గాయం బారిన పడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మొదటి టీ20 మ్యాచ్లో వికెట్ల మధ్య ఎంతో కష్టతరంగా పరుగులు పెట్టాడు. ఈ నేపథ్యంలో అతనికి ప్రస్తుతం స్కాన్ చేసే గాయం తీవ్రతను తెలుసుకునేందుకు వైద్య బృందం నిర్ణయించింది. ఈ క్రమంలో గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే భారత్తో జరగబోయే రెండవ టి 20 మ్యాచ్ కి  ఆస్ట్రేలియా కెప్టెన్ ఫించ్ దూరం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: