ఈ మధ్య కాలం లో మానవ బంధాల కు విలువ లేకుండా పోతుంది. కామంతో కళ్లు మూసుకు పోతున్న ఎంతోమంది వావి వరసలు మరిచి దారుణం గా వ్యవహరిస్తున్న ఘటనలు ఎన్నో తెర మీదికి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. రోజురోజుకు ఇలా మానవ బంధాలు మరిచి  వరసలు మరిచి పోయి దారుణం గా వ్యవహరిస్తున్న ఘటనల తో సభ్య సమాజం తలదించు కుంటుంది .  ఏకంగా కామం తో కళ్లు మూసుకు పోతున్న కొంత మంది సొంత వాళ్లను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సినది పోయి పశువుల్లా  మారిపోతున్నారు.



 తల్లి చెల్లి బిడ్డ అనే తేడా లేకుండా అత్యాచారాల కు పాల్పడుతున్న ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి  దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి తరహా దారుణ ఘటన వెలుగు లోకి వచ్చింది. బీహార్కు చెందిన కేశవకుమార్ పని నిమిత్తం ఢిల్లీలో ఉంటున్న బంధువుల దగ్గర ఉంటున్నాడు. ఏదో ఒక ఉపాధి చేసుకొని జీవిస్తున్నాడు కేశవ్ కుమార్.  బంధువుల ఇంటివద్ద గది అద్దెకు తీసుకున్నాడు తీరిక సమయంలో బంధువుల ఇంటికి వెళుతూ వుండేవాడు.  ఈ క్రమంలోనే ఆ ఇంట్లో ఉన్న పదహారేళ్ల బాలిక తో చనువుగా. మెలుగుతూ ఉండేవాడు అయితే వరుసకు బాబాయ్ కావడంతో సదరు బాలిక కూడా ఏం అభ్యంతరం చెప్పలేదు.



 ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోలేదు... ఈ క్రమంలోనే మాయమాటలతో సదరు బాలికను తన వైపు తిప్పుకోవడం మొదలుపెట్టాడు ఇక లవ్ ట్రాక్ తెరమీదికి తెచ్చారు ఎవరికీ తెలియకుండా నోయిడాకు తీసుకెళ్లి అక్కడ ఒక గది అద్దెకు తీసుకుని శారీరకంగా అమ్మాయిని వాడుకున్నాడు.  సుమారు మూడు నెలల పాటు సదరు 16 ఏళ్ల బాలికతో  కేశవ్  సహజీవనం చేశాడు. తల్లిదండ్రులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలికను తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించి నిందితున్ని అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: