2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కు వచ్చిన క్రేజ్ చూసి ఎంతో మంది తెలుగుదేశం ఇతర పార్టీల నుంచి వచ్చి చేరారు. 151 సీట్లతో వైసిపి బలంగా ఉండడం రాబోయే ఎన్నికల్లో టిడిపి బలం పుంజుకునే అవకాశం కనిపించకపోవడం ఇలా ఎన్నో లెక్కలు వేసుకుని నాయకులు ముందు వెనుక చూడకుండా వైసీపీలో చేరిపోయారు. వైసీపీని టిడిపి కంటే మరింత బలోపేతం చేసేందుకు చేరికలకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో నియోజకవర్గ స్థాయి నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్యేలు ,ఎంపీలు, మండల స్థాయి నాయకులు ఇలా ఎంతో మంది వైసీపీ లో చేరిపోయారు.
తెలుగుదేశం పార్టీకి రాజకీయ భవిష్యత్తు కనిపించకపోవడం ,
వైసీపీ పరిస్థితి మెరుగ్గా ఉండటం ఇలా ఎన్నో లెక్కలతో చేరికలు వైసీపీలోకి ఎక్కువయ్యాయి. ఇదిలా ఉంటే
టిడిపి ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులు కారణంగా తమ హవా కు అడ్డు పడుతుందేమో అని మొదటి నుంచి
వైసిపి లో ఉన్న నాయకులు అనుమానం వ్యక్తం చేస్తూ ... ఇదే విషయాన్ని
పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లిన పెద్దగా పట్టించు కోనట్టు వ్యవహరించారు. ఇక ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి వచ్చిన వారు, మొదటి నుంచి వైసీపీలో ఉన్న వారికి మధ్య ఇప్పటికీ సఖ్యత లేదు.
నిత్యం గ్రూపు తగాదాలతో పరిస్థితి ఇబ్బందికరంగా మారుతు వస్తోంది. గత
టిడిపి ప్రభుత్వంలో మంచి ప్రాధాన్యం ఉన్నత పదవులు అనుభవించిన
తోట త్రిమూర్తులు, రామ సుబ్బారెడ్డి ,
దేవినేని అవినాష్ ,
కదిరి బాబురావు జూపూడి
ప్రభాకర్, సిద్ధ రాఘవరావు, పంచకర్ల రమేష్ బాబు ఇలా ఎంతో మంది
వైసీపీ లో ఇబ్బంది పడుతున్నారు. వీటిని నియోజకవర్గాల్లో మొదటి నుంచి వైసీపీలో ఉన్న నాయకులు పక్కన పెట్టినట్టు వ్యవహరిస్తున్నారు . అలాగే
వైసిపి అధిష్టానం కూడా ఇదే విధంగా వ్యవహరిస్తూ ఉండటం , పదవుల విషయంలోనూ పట్టించుకోనట్టు గా వ్యవహరిస్తుండడంతో, వీరి బాధ అంతా ఇంతా కాదు . ఇప్పుడు వైసీపీకి దూరం అవ్వలేక వేరే పార్టీలు చేరలేక రాజకీయంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. తమపై
జగన్ కరుణ ఎప్పటికి దక్కేనో అనే సవాలక్ష సందేహాలు ఉన్నారు.