తెలంగాణాలో రాజకీయాలు ఎప్పుడు లేనంత వేడిగా మారిపోయాయి.  దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ కి పుండుమీద కారణం చాలినంత పనవుతుంది.  బీజేపీ గెలవకపోయినా గెలిచినట్లుగా టీ ఆర్ ఎస్ కన్నా ఎక్కువగా సంబరాలు చేసుకుంటుంది.. గతంలో ఎప్పుడు లేనటువంటి సంతోషం ఆయా పార్టీ ల నేతల్లో ఇప్పుడు కనిపిస్తుంది.. గెలిచిన సంబరం కంటే కేసీఆర్ ని నిలువరించామనే సంతోషం ఇప్పుడు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది.

అయితే ప్రచారం సమయంలో ఈ రేంజ్ లో ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని బీజేపీ కూడా ఊహించదు.. ఎందుకంటే దుబ్బాక లో పార్టీ అభ్యర్థి ని చూసి సింపతీ తో ప్రజలు ఓట్లు వేశారు తప్పా తమని చూసి కాదని బీజేపీ కి తెలుసు..యినా పిచ్చి పోరాటం తో గ్రేటర్ లో అడుగుపెట్టి కేసీఆర్ పై పైచేయి సాధించారు. అయితే కొన్ని నెలలుగా తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం కష్టమని అర్థమవుతుంది. అందుకే తెలంగాణ లో తనకు దూరమైనా నేతలను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారట..

తెలంగాణ ఉద్యమ సమయంలో తనకు అండగా నిలిచినా వారిని అధికారంలోకి రాగానే పక్కన పెట్టి వారిని ఒకరకంగా అవమానించారు. అయితే ఇప్పుడు వారి అవసరం వచ్చిందని అనుకున్నాడో ఏమో వారి మద్దహతు కోరుతున్నాడు. కోదండరాం, అప్పటి విద్యార్ధి సంఘాల నేతలు, వామపక్షాలు, ఇలా కొంత మందిని దగ్గర చేసుకుంటున్నారు. తెలంగాణాలో సీనియర్ నేతలను కూడా దగ్గర చేసుకుంటున్నారు. అవసరం లేదని అవమానించి పక్కన పెట్టిన వారిని ప్రగతి భవన్ కి రావాలని ఫోన్ లు కూడా వెళ్తున్నాయి. అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానాలు కూడా వెళ్తున్నాయి. అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో వామపక్షాల మద్దతుతో పోటీ చేయాలని, టీజేఎస్ ని కూడా కలుపుకోవాలని సిఎం కేసీఆర్ ప్రత్యేక వ్యూహాలను సిద్దం చేసి ముందుకు వెళ్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: