చాలా రోజులుగా ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు ఎన్నో చోటు చేసుకుంటున్నా, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ ఎక్కడా కనిపించడం లేదు. సోషల్ మీడియా ద్వారానే ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు ఆయన ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు తప్ప, ప్రత్యక్షంగా ఏపీలో అడుగుపెట్టేందుకు ఇష్ట పడకపోవడం,  హైదరాబాద్ లోని తన నివాసానికి పరిమితమై పోవడం వంటి వ్యవహారాలతో టిడిపి శ్రేణులు సైతం లోకేష్ తీరుపై అసహనం గా ఉన్నాయి. వాస్తవంగా లోకేష్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఆయన పొలిటికల్ ఎంట్రీ నే ఎమ్మెల్సీ గా, మంత్రిగా ఉన్నత పదవులు నిర్వహించారు. ప్రత్యక్షంగా ప్రజల నుంచి ఎన్నికైంది లేదు. 




2019 ఎన్నికల్లో ఘోరంగా మంగళగిరి నియోజకవర్గం నుంచి ఆయన ఓటమి చెందారు. ఇక దేశవ్యాప్తంగా చంద్రబాబుకు ఉన్న పేరు ప్రఖ్యాతులు అన్ని ఇన్ని కావు. తండ్రికి తగ్గ తనయుడిగా లోకేష్ తన సత్తా మెరుగు పెంచుకుంటూ వస్తున్నా,  ఎక్కడా లోకేష్ సందడి కనిపించడం లేదు. ఇప్పటికీ తెలుగుదేశం భారం మొత్తం చంద్రబాబు మీదే పడింది. బాబు విశ్రాంతి తీసుకుందాం అనుకున్నా, ఆ స్థాయిలో బాధ్యతలు నిర్వహించే వారు కరువవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ తరఫున యాక్టివ్ గా ఉండాల్సి వస్తోంది. లోకేష్ తన బరువు బాధ్యతలు ఏమైనా పంచుకుంటాడు అని ఆశిస్తున్నా, ఆ దిశగా అడుగులు పడకపోవడం వంటి వ్యవహారాలతో లోకేష్ పార్టీలోనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. 




అప్పుడప్పుడు చంద్రబాబు ప్రత్యక్షంగా జనాల్లోకి వచ్చి హడావుడి చేస్తున్నారు తప్ప, లోకేష్ పెద్దగా కనిపించడం లేదు. ఇటీవల వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చి రెండు రోజులు హడావిడి చేసినా పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోయాడు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ బరువు బాధ్యతలను మోయాలి అంటే ఇప్పటి నుంచి పార్టీలో బలం పెంచుకునే ప్రజా నాయకుడిగా ఎదగాల్సి ఉన్నా లోకేష్ సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు పరిమితమై పోతున్నారు. పార్టీలో ఉత్సాహం పెంచేందుకు ఇటీవల చంద్రబాబు రాష్ట్ర , జాతీయ స్థాయి కమిటీలను నియమించారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీకి మేలు జరిగే విధంగా వివిధ కార్యక్రమాలు రూపొందించుకోవాల్సిన బాధ్యత ఉన్న ఆ విధంగా లోకేష్ వ్యవహరించకపోవడం ఆయనకు ఇబ్బందికరంగా మారింది. భవిష్యత్ లో లోకేష్ కు ఈ వ్యవహారాలన్నీ ఇబ్బంది కరంగా మారే అవకాశం కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: