తెలంగాణలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు సర్వం సిద్ధం చేశారు సబ్ రిజిస్ట్రార్లు. పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్లు జరగనున్నాయ్. ఆన్‌లైన్ ద్వారా చేపట్టే ఈరిజిస్ట్రేషన్లను విజయవంతంగా నిర్వహించేందుకు ట్రయల్ రన్ నిర్వహించారు.శనివారం సెలవుదినమైనా సరే రిజిస్టార్ సిబ్బంది విధులకు హజరయ్యారు. సాఫ్ట్‌వేర్ పరిశీలన, ఇతర సమస్యలు ఉత్పన్నం కాకుండా సకాలంలో దస్తావేజులను పూర్తి చేసి అందించేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కసరత్తు చేశారు.
ఆధార్ వివరాలు అవసరం లేకుండానే రిజిస్ట్రేషన్లను చేసే కొత్త విధానం అమలు చేస్తున్నారు. వితౌట్ ఆధార్ అనే అప్షన్‌ను కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చారు. స్లాట్ బుక్ చేసుకుని అస్తిపన్ను గుర్తింపు సంఖ్యను సమర్పించాలనే నిబంధన తప్పనిపరి చేశారు. స్లాట్ బుకింగ్‌లకు డిమాండ్ కనిపించడంతో స్లాట్ల సంఖ్యను పెంచాలని అధికారులు భావిస్తున్నారు.మూడు నెలలుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో అధికారులపై మరింత ఒత్తిడి పెరగనుంది. సోమవారం నుంచి స్లాట్ బుకింగ్ పరిమితిని పెంచే అవకాశం ఉంది.
మరోవైపు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్స్‌కు సాంకేతిక సమస్యలు వస్తున్నాయ్. సగం వివరాలు నమోదు చేశాక ఆటోమెటిక్‌గా సైట్ క్లోజ్ అవుతోంది. పేమెంట్ జరిగాక కనీసం రిసిప్ట్ కూడా రావడం లేదు. కార్యాలయాలకు సెలవులు ఉన్నప్పటికి ప్రభుత్వం శని ఆదివారాల్లో కూడా పని చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఐతే సిబ్బంది వచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. మరి సోమవారం లోపు ఈ సాంకేతిక సమస్యలు పరిష్కరమవుతాయా లేదన్నది ప్రశ్నర్థాకంగా మారింది. మొత్తానికి తెలంగాణలో వ్యవసాయేతర రిజిష్ట్రేన్లకు కొత్త కష్టాలు వచ్చి బడ్డాయి. సర్వర్ల సమస్య అధికారులను వేధిస్తుండటంతో ప్రజలు అసహనానికి గురవుతున్నారు. చూద్దాం.. టెక్నికల్ సమస్యను అధికారులు ఏ విధంగా పరిష్కరించుకుంటారో.