వాహనదారులు పోలీసుల కళ్లు కప్పెందుకు కొత్త విధానాలను కనుక్కొంటున్నారు... పోలీసులు వేసే చలానాల నుంచి విముక్తి పొందటానికి కొన్ని మార్గాల ద్వారా బయటపడుతున్నట్లు తెలుస్తుంది. ఎంత మాయ చేసిన ఎక్కడో చోట పోలీసులకు చిక్కాల్సిందే.. కానీ.. కొందరు వ్యక్తులు రోడ్డు నిబంధనలు ఉల్లంఘించినా ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు కొత్త ఉపాయాన్ని కనిపెట్టారు.



వాహన దారులను రోడ్డు ప్రమాదాల నుంచి రక్షించడానికి కొత్త  నిబంధనలను అనుసరించి చేయాలని అంటున్నారు. వాటి కోసం పోలీసులు అహర్నిశలు కష్టపడుతున్నారు. రోడ్డు నిబంధనలను అతిక్రమించిన వారిని గుర్తించేందుకు ప్రధాన మార్గాల లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం.. ట్రాఫిక్‌ పోలీసులు రోడ్డు పై, మూ లమలుపుల వద్ద ట్రాఫిక్‌ సిబ్బంది నిలబడి గుట్టు చప్పుడు కాకుం డా నిబంధనలు అతిక్రమించిన వాహనాలను కెమెరాలలో బంధిస్తున్నారు. అతివేగంతో వెళ్లినా.. సిగ్నల్‌ను జంప్‌ చేసినా.. రాంగ్‌ రూట్‌ లో వెళ్లినా.. హెల్మెట్‌ ధరించకపోవడం, ఇతరత్రా నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాల నంబర్ల ఆధారంగా వాహన యజమానులకు  బిల్లు చెల్లించాలని మొబైల్ కు మెసేజ్ వస్తుంది.  


ఇలాంటి నిబంధనలను అతిక్రమించడానికి  బండి నంబర్ ప్లేటు పై రంగు పూయడం, కొందరు నంబర్‌ ప్లేట్లను తొలగించడం, నంబర్‌ ప్లేట్‌పై రంగులు పూయడం, నంబర్లు కనిపించకుండా రంగును తీసేస్తున్నారు. మరికొందరు ఒక నంబర్‌ పూర్తిగా కనిపించకుండా మూసిపెట్టడం లేదా తొలగించడం చేస్తున్నారు. వాహనాల నంబర్‌ ప్లేట్లు నిబంధనల ప్రకారం ఉండా ల్సిందే. నిబంధనలు అతిక్రమించి నంబర్‌ ప్లేట్‌పై నంబర్లు కనిపించకుండా మాయం చేస్తే భారీగా జరిమానాలు విధిస్తున్నాం..అలా చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు అవుతాయని అంటున్నారు.. అలా చేయడం చట్ట రీత్యా నేరమని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇంకా చెప్పాలంటే నంబర్ ప్లేటు లేకుండా వాహనం కనిపిస్తే వాటిని అదుపు లోకి తీసుకుంటామని ట్రాఫిక్ సీఐ బోస్ కిరణ్ తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: