అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నుంచి భారత రక్షణరంగ పరిశోధన సంస్థ డీఆర్డీవో పూర్తిస్థాయి మద్దతు అందడంతో పాటు పూర్తి స్థాయి నిధులు కూడా అందుతున్న నేపథ్యంలో ప్రస్తుతం డిఆర్డిఓ ఎంతో శరవేగంగా ఆయుధాలను అభివృద్ధి చేస్తూ ఉంది అనే విషయం తెలిసిందే. అదే సమయంలో ప్రస్తుతం ఎంతోఅధునాతన టెక్నాలజీతో కూడిన ఆయుధాలకు పురుడుపోస్తుంది డి ఆర్ డి ఓ. ఈ క్రమంలోనే గతంలో కేవలం 60 కిలోమీటర్లదూరం లో ఉన్నటువంటి లక్ష్యాన్ని ఛేదించగల సామర్థ్యం కలిగిన అస్త్ర మిస్సయిల్ 120 కిలోమీటర్ల దూరం కలిగిన కలిగిన సామర్థ్యం కలిగిన దానిగా అప్గ్రేడ్ చేసింది డి ఆర్ డి ఓ.
ఇప్పుడు అస్త్ర 2 అనే సరికొత్త ఇన్నోవేషన్ తెర మీదికి తెచ్చింది డిఆర్డిఓ. 120 కిలోమీటర్ల కాదు ఏకంగా 180 కిలోమీటర్ల దూరం లో ఉన్నటువంటి లక్ష్యాన్ని ఎయిర్ టు ఎయిర్ చేయించగల సామర్థ్యం కలిగినటువంటి అస్త్ర అనే మిసైల్ తయారీకి ప్రస్తుతం సంకల్పించింది దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా శరవేగంగా జరుగుతుంది. ఇక ఇప్పటి వరకు ఉన్న అన్ని రకాల మిస్సైల్స్ కంటే అస్త్ర మిస్సైల్ నెంబర్ వన్ గా మారుతుందని ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలు భారత్ నుంచి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.