జగన్మోహన్ రెడ్డి సర్కార్ వికేంద్రీకరణ కు సంబంధించిన ప్రకటన చేసిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పటికీ వికేంద్రీకరణ కు సంబంధించిన వేడి రగులుతూ నే ఉంది అన్న విషయం తెలిసినదే. జగన్ సర్కార్ తీసుకొచ్చిన వికేంద్రీకరణను వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు అందరూ ఉద్యమ బాట పట్టారు. రాజధాని కోసం తమ వ్యవసాయ భూములను త్యాగం చేశామని ఇక ఇప్పుడు రాజధాని అమరావతి నుంచి మారుస్తాము అంటే తమకు అన్యాయం జరుగుతుంది అంటూ అమరావతి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని గా అమరావతి నే కొనసాగించాలి అంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు రైతులు.



 అయితే రాష్ట్రంలో అభివృద్ధి ఒకేచోట ఆగిపోకూడదు అని వివిధ ప్రాంతాలు అభివృద్ధి జరిగినప్పుడు మాత్రమే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందని అందుకే తమ ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది అంటూ అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సీఎం జగన్ వికేంద్రీకరణ కు సంబంధించిన నిర్ణయాన్ని విరమించుకునేంత వరకు తమ ఉద్యమాన్ని ఆపేది లేదు అంటూ.. అమరావతి రైతులు అందరూ కూడా ఉద్యమం చేపడుతున్నారు అన్న విషయం తెలిసిందే



 అమరావతి రైతులు చేపడుతున్న ఉద్యమం ఏకంగా ఏడాది పూర్తి చేసుకుంది.ఈ క్రమంలోనే  అమరావతి రైతుల ఉద్యమం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు.  ఏపీ ప్రజలు మూడు రాజధానులు ఒప్పుకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. 3 రాజధానులు పై అధికార పార్టీకి నమ్మకం ఉంటే రిఫరెండం పెట్టాలి అంటూ డిమాండ్ చేశారు. రాయపూడి లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: