ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాల ను పట్టిపీడిస్తున్నది  అన్న విషయం తెలిసిందే. ముఖ్యం గా అగ్ర రాజ్యాలనూ అతలాకుతలం చేస్తుంది ఈ మహమ్మారి వైరస్. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ విలయ తాండవం చేస్తూ ప్రస్తుతం ఎంతోమంది పై పంజా విసురుతోంది.  అగ్ర రాజ్యాల లో ఇప్పటికే కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా నమోదు కాగా ఇక ఇప్పుడు సెకండ్ వేవ్  కూడా వణికిస్తున్న నేపథ్యంలో ఇక అగ్ర రాజ్యాల ప్రభుత్వాలు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.



 ఇక ప్రస్తుతం సెకండ్ వేవ్  ప్రభావం అగ్ర రాజ్యాల లో మరింత తీవ్రంగా ఉన్న నేపథ్యం లో ప్రజలందరూ మరింత భయాందోళనకు గురి అయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యం లోనే ప్రస్తుతం అగ్రరాజ్యమైన బ్రిటన్లో ఆహార సంక్షోభం ఏర్పడినట్లు తెలుస్తోంది.  దీనికి కారణం కరోనా  వైరస్ అని విశ్లేషకులు అంటున్నారు. కరోనా  వైరస్ కేసులు వెలుగు లోకి వచ్చిన మొదట్లో ఎంతో సమర్థవంతం గా పాలన సాగించిన బ్రిటన్ ప్రభుత్వం ఇప్పుడు సెకండ్ వేవ్  స్టార్ట్ కావడం తో ఆహార సంక్షోభాన్ని  ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు విశ్లేషకులు.



 ప్రస్తుతం బ్రిటన్లో ప్రజలందరూ రోడ్ల మీదికి వచ్చి సరైన నిబంధనలు పాటించకపోవడంతో సెకండ్ వేవ్  విజృంభిస్తుంది అన్న విషయం తెలిసిందే. దీంతో రోజురోజుకు కెడులు  పెరిగిపోతున్న తరుణం లో మళ్లీ లాక్ డౌన్ విధించే పరిస్థితులు దాపురిస్తున్నాయి...  ఈ క్రమం లోనే మళ్లీ లాక్డౌన్ విధించే ప్రమాదం ఉందని భావిస్తున్న ప్రజలు అవసరానికి మించి నాలుగింతలు ఆహారాన్ని కొనుగోలు చేస్తుండడంతో ప్రస్తుతం అక్కడ ఆహారపు కొరత వస్తున్నట్లు విశ్లేషకులు అంటున్నారు. ఇక ఆహార కొరతను తీర్చేందుకు ప్రస్తుతం ప్రభుత్వం ఏ తరహా నిర్ణయం తీసుకోవాలో తెలియక ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రస్తుతం అక్కడి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: