ఇక ఇటీవల కాలంలో అణ్వస్త్రాల తయారీలో అగ్ర శాస్త్రవేత్త అయినటువంటి వ్యక్తిని వ్యూహాత్మకంగా హత్య చేయడం సంచలనం గా మారిపోయింది. శాస్త్రవేత్త కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ఆటోమేటిక్గా వేగం తగ్గేలా చేసి ఇక పక్కనే ఉన్న కార్ కి మిషన్ గన్ ఏర్పాటు చేసి శాస్త్రవేత్తను టార్గెట్ చేస్తూ భారీగా కాల్పులు జరపడంతో శాస్త్రవేత్త శరీరం పూర్తిగా తుక్కు తుక్కు గా మారిపోయింది. ఆ తర్వాత ఎలాంటి ఆధారాలు దొరకకుండా కార్ ఆటోమేటిక్ గా పేలిపోవడం మరింత సంచలనం గా మారిపోయింది.అయితే అణు శాస్త్రవేత్త హత్య సంచలనంగా మారింది.
ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవల ఇరాన్ తీసుకున్న నిర్ణయం కాస్త మరింత సంచలనం గా మారిపోయింది. కయ్యానికి కాలుదువ్వే లాగా ప్రస్తుతం ఇరాన్ తీసుకునే నిర్ణయం ఉంటుంది అని విశ్లేషకులు అంటున్నారు ఏకంగా అణ్వస్త్రాల తయారీ కోసం 256 శాతం నిధులను అధికంగా ఇస్తూ ఇరాన్ నిర్ణయం తీసుకుంది. అయితే ఇటీవల ఇరాన్ తీసుకున్న నిర్ణయం కారణంగా అటు ఇజ్రాయిల్ తో పాటు అమెరికా లాంటి అగ్ర దేశాలు కూడా ఇరాన్పై మరింత ఆంక్షలు పెంచే అవకాశం ఉందని లేదా దాడులకు పాల్పడే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు అంటున్నారు రోజులు ఇరాన్ పరిస్థితి కాస్త ఇరాక్ గా మారే అవకాశం ఉందని అంటున్నారు.