పాకిస్తాన్ ఎప్పుడూ భారత్లో విధ్వంసాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే.  ఏదో విధంగా ఉగ్రవాదులను భారత్ లోకి చొరబడేలా చేయడం లేదా ఇక పాకిస్తాన్ చైనా సరిహద్దుల్లో పాకిస్తాన్ సైనికులతో దాడి చేయించడం లాంటివి చేస్తూనే ఉంటుంది. అయినప్పటికీ భారత సైన్యం మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఓవైపు ఉగ్రవాదులకు మరోవైపు పాకిస్తాన్ సైన్యంపై  కూడా ఎప్పటికప్పుడు ఎదురుదాడి దిగుతుంది అన్న విషయం తెలిసిందే.  అయితే భారత్  ఎన్ని సార్లు పాకిస్తాన్ ను కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టినప్పటికీ పాకిస్తాన్ కి  బుద్ధి మాత్రం మార్చుకోవడం లేదు.


 ఎప్పుడూ ఏదో ఒక విధంగా భారత్పై పాకిస్థాన్ దుమ్మెత్తి పోస్తూనే ఉంది.. అయితే గతంలో పుల్వామాలో  సైనికులు ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకుని ఏకంగా ఓ ఉగ్రవాది ఆత్మహుతికి  పాల్పడడంతో ఈ ఘటనలో ఎంతో మంది జవాన్లు వీరమరణం పొందారు అన్న విషయం తెలిసిందే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా అందరిని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేయడంతోపాటు అందరి రక్తాన్ని మరి గించింది.  ఈ క్రమంలోనే తీవ్రంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఏకంగా పాకిస్థాన్లో ఉగ్రవాదుల స్థావరాలను గుర్తించి సర్జికల్ స్ట్రైక్ నిర్వహించడం సంచలనంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.


ఇటీవల వరుసగా సరిహద్దుల్లో పాక్ కాల్పులకు తెగబడుతున్న  నేపథ్యంలో మరోసారి సర్జికల్ స్ట్రైక్ చేసే అవకాశాలు ఉన్నాయి అన్న టాక్ కూడా వినిపిస్తోంది. కాగా దీనిపై ఇటీవలే పాకిస్థాన్  విదేశాంగ శాఖ మంత్రి మహమ్మద్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్పై భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసేందుకు సిద్ధమైంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు.  దీనిపై తమ ఇంటిలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం అందింది అంటూ చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి తమ భాగస్వాముల దగ్గర సైనిక చర్యలకు ఒప్పందం కూడా కుదుర్చుకుంది అంటూ వ్యాఖ్యానించారు ప్రస్తుతం భారత్లో నెలకొన్న రైతుల ఉద్యమ మరికొన్ని అంతర్గత సమస్యలను పక్కదారి పట్టించేందుకు సర్జికల్ స్ట్రైక్ చేసేందుకు సిద్ధమైంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: