
అయితే 370 ఆర్టికల్ రద్దు తర్వాత అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది అన్న విషయం తెలిసిందే. అయితే 370 ఆర్టికల్ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో మొదటి సారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఏడు దశల్లో జరిగిన ఎన్నికలు ఇటీవలే పూర్తవగానేడు జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడుతున్నాయి.
ఈ క్రమంలోనే బిజెపిలో ప్రస్తుతం ఎంతగానో ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే 370 ఆర్టికల్ రద్దు తర్వాత బీజేపీ కాశ్మీర్ లో ఎన్నో వ్యూహాలను అమలు చేసింది. ఓవైపు మౌలిక వసతులు కల్పించడం ఉద్యోగాల కల్పన మరియు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం... అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడం లాంటివి చేసింది బిజెపి. ఈ క్రమంలోనే బీజేపీ కార్యాచరణకు ప్రస్తుతం జమ్మూకాశ్మీర్లో జరగబోయే ఎన్నికలు నిలువుటద్దంగా మారాయి. మొదటిసారి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ప్రజలు బీజేపీకి పట్టం కడతారా లేక మళ్ళీ వేర్పాటువాదుల కే అక్కడ అధికారాన్ని అప్ప చెబుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. జమ్మూ కాశ్మీర్ ఫలితాల పై బీజేపీ పెద్దలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.