విషయంలోకి వెళ్తే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భూ అక్రమాలు జరిగాయంటూ.. జగన్ అనేక సార్లు ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆయా భూముల బాగోతం తేల్చేందుకు సిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంపై సుదీర్ఘ విచారణ జరిపిన సిట్.. పెద్ద ఎత్తున భూములు ఆక్రమణకు గురైనట్లు గుర్తించినట్టు తెలిసింది. దీనికి సంబంధించిన ఓ నివేదికను కూడా సిట్ సిద్ధం చేసింది. దీనిని జగన్‌కు అందించేందుకు సిట్ బృందం ఎదురు చూస్తోంది. ఇక, విషయం పరంగా చూసుకుంటే.. ప్రభుత్వ భూములు కేటాయింపులు, రికార్డులు ట్యామ్ పరింగ్, ఎన్ఓసీ జారీ, 22A భూములు అక్రమాలు జరిగాయని గతంలోనే వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపించింది.
అంతేకాదు, మొత్తం 350 నుంచి 400 ఎకరాల్లో భూములు అక్రమాలు జరిగినట్లు విమర్శలు గుప్పించింది. దీనిపై అసెంబ్లీలోనూ ఏడాది కిందట చర్చ జరిగింది. ఈ క్రమంలోనే చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్న వైసీపీ నాయకులు.. దీనిపై సిట్ వేశారు. ఈ సిట్ గడిచిన ఆరు మాసాలుగా పరిశోధించి నివేదిక తయారు చేసినట్టు తాజాగా వెలుగుచూసింది. దీనిపై ప్రస్తుతానికి వైసీపీ నాయకులు పెదవి విప్పకపోయినా.. అతి రహస్యం కనుక దానంతట అదే బట్టబయలు అయిపోయింది. అయితే.. నేరుగా చంద్రబాబుపై ఈ విషయంలో టార్గెట్ చేస్తారా? లేక.. ఇతర నేతలను కూడా ఇరికిస్తారా? అనేది ఆసక్తిగా మారింది.
మరోవైపు టీడీపీలోనూ ఈ భూములకు సంబంధించిన అక్రమాలపై గుబులు రేగుతోంది. ఏం చేస్తారో.. అని నాయకులు కొన్నాళ్లుగా చర్చించుకుంటున్నారు. అయితే.. అమరావతి భూముల మాదిరిగా ఇది తేలిపోతుందా? లేక గట్టి షాక్ ఇస్తుందా? అనేది చూడాలి. ఏదేమైనా.. చంద్రబాబుకు ఏదో ఒక రూపంలో జగన్ గిప్ట్ ఇస్తున్నారని సోషల్ మీడియాలో అప్పుడే టాక్ వచ్చేసింది.