ఇక ఇటీవల ఇదే విషయంపై స్పందించిన టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ విరాట్ కోహ్లీ విషయంలో టీమిండియా యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీమిండియా మేనేజ్ మెంట్ ఆటగాళ్ల విషయంలో పక్షపాతంగా వ్యవహరిస్తున్నది అంటూ విమర్శించారు సునీల్ గవాస్కర్. ఇటీవలే భారత జట్టులో స్థానం సంపాదించుకున్న నటరాజన్ భార్య సరిగ్గా ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరే ముందే ప్రసవించింది. ఈ క్రమంలోనే బిసిసిఐ నటరాజన్ వెళ్లేందుకు అంగీకరించలేదు. ఏకంగా అటు నుంచి అటే ఆస్ట్రేలియా పర్యటనకు తీసుకెళ్ళింది బిసిసిఐ ఇక ఆ తర్వాత చేస్తూ టి20 వన్డే ముగిసినప్పటికీ ప్రాక్టీస్ బౌలర్ గా నటరాజన్ ను అక్కడే ఉంచుతుంది.
అలాంటి బిసిసిఐ ప్రస్తుతం విరాట్ కోహ్లీకి అనుమతి ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది అంటూ సునీల్ గవాస్కర్ హితవు పలికాడు. ఓకే టీమ్ లో ఉన్న విరాట్ కోహ్లీనీ నటరాజన్ ను వేరు వేరుగా చూడటం టీమిండియా మేనేజ్మెంట్కు చెల్లదు అని ఎద్దేవా చేశారు. భారత జట్టులో మరో ఆటగాడు రూల్స్ గురించి ఆశ్చర్యం వ్యక్తం చేసి ఉంటాడు... అయితే అతను కొత్తగా జట్టులోకి వచ్చి ఉండడం తో నోరు మెదపడం లేదు.. అతను ఎవరో కాదు టీ నటరాజన్ యాంకర్ల స్పెషలిస్ట్.. ఇటీవలే తండ్రి అయిన నటరాజన్ తన బిడ్డని ఇంకా చూడలేదు.. యూఏఈ నుంచి నేరుగా ఆస్ట్రేలియా కి తీసుకెళ్లారు.. ఇలా నటరాజన్ విషయంలో ఒకలా కోహ్లీ విషయంలో మరొకల బిసిసిఐ వ్యవహరిస్తుందని సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.