తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. అదే పనిగా టిఆర్ఎస్ ను విమర్శిస్తూ, ఆ పార్టీ పై ప్రజల్లో వ్యతిరేకత పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. టిఆర్ఎస్ వ్యతిరేక అంశాలను ఆయన తెర పైకి తీసుకు వస్తూ, టిఆర్ఎస్ ఇమేజ్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ పాతబస్తీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాత బస్తీలో ఉన్న రోహింగ్యాలు, పాకిస్థానీయులు బయటకు రావాలంటే ఏం చేయాలి అనే విషయంపై టిఆర్ఎస్ ప్రభుత్వానికి బోధ చేశారు. 




" తెలంగాణ పోలీసులు నిజంగా హీరోలే... పదిహేను నిమిషాలు ఓల్డ్ సిటీ ని అప్పగిస్తే జల్లెడ పడతారు. పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తానీ లను బయటకు తీస్తారు. దమ్ముంటే ఓల్డ్ సిటీ ని పోలీసులకు అప్పగించండి అంటూ సంజయ్ సంచలన విమర్శలు చేశారు. ఖమ్మం, వరంగల్ ,సిద్దిపేట కార్పొరేషన్ కు చెందిన టిఆర్ఎస్ నాయకులు బిజెపిలో చేరబోతున్నారని, దుబ్బాక జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓడినా, కెసిఆర్ అహంకారం ఏమాత్రం తగ్గలేదని విమర్శించారు. తక్షణమే గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నిక వెంటనే నిర్వహించాలని సంజయ్ డిమాండ్ చేశారు.



 టిఆర్ఎస్ , బిజెపి కార్పొరేటర్లు ఒక్కొక్కరికి ఐదు కోట్లు చొప్పున ఆఫర్లు ప్రకటిస్తున్నారని, కొంత మంది టిఆర్ఎస్ కార్పొరేటర్లు బిజేపి లో చేరేందుకు వస్తున్న మేము చేర్చుకోవడం లేదని వ్యాఖ్యానించారు. టిఆర్ఎస్ మమ్మల్ని కనుక గెలికితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బిజెపిలో చేర్చుకుంటామన్నారు. పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారులతో తమ నాయకులను ప్రభావితం చేస్తున్నారంటూ టిఆర్ఎస్ ప్రభుత్వం పై బండి సంజయ్ మండిపడ్డారు.




మరింత సమాచారం తెలుసుకోండి: