బీజేపీలో చేరికలపై తన అభిప్రాయాన్ని జర్నలిస్టులతో పంచుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో సభ్యుడిగా ఉన్న ఉండవల్లి ఆ తర్వాత ఆ సిద్ధాంతాలను విభేదించి కాంగ్రెస్‌లో చేరారు. ఇందుకు గల కారణాలను ఆయన వివరించారు. ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంత కర్త గురు గోల్వాల్కర్ రాసిన పాంచజన్యం పుస్తకం చదివిన తర్వాతే.. తాను ఆర్‌ఎస్‌ఎస్ ను వీడానని ఆయన చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలు దేశానికి మంచివి కావని కూడా చెప్పారు. బీజేపీలో చేరాలనుకుంటున్న వారు.. ముందు ఆ పుస్తకం చదివిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని సలహా ఇచ్చారు.
దీంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ఉండవల్లి ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇప్పుడిప్పుడే బలపడాలనుకుంటున్న బీజేపీ కి ఇది దెబ్బ పడే అవకాశమని వారు భావిస్తున్నారు. అధికారం లేకపోతే ప్రతిపక్ష స్థానం అయినా దక్కించుకోవాలని పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా పార్టీలోకి వచ్చే వారికి సాదర స్వాగతం పలుకుతోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కాలికి బలపం కట్టుకుని రాష్ట్రమంతా తిరుగుతూ.. పార్టీలోకి చేరాలంటూ తాజా, మాజీ నాయకులను ఆహ్వానిస్తున్నారు. టీడీపీ తాజా, మాజీ నేతలను చేర్చుకోవాలని బీజేపీ లక్ష్యంగా చేసుకుంది. ఆ దిశగా కొన్ని చేరికలు కూడా జరిగాయి.