తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం గా రైతు బంధు అనే పథకాన్ని ప్రవేశపెట్టింది అన్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా అధికారం లోకి వచ్చిన వెంటనే రైతులందరికీ పెట్టుబడి సాయం అందించాలి అనే ఉద్దేశం తో రైతుబంధు అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఈ సరికొత్త పథకం ద్వారా రైతులందరికీ ప్రతి ఎకరాకి ఐదు వేల రూపాయలు పెట్టుబడి సహాయాన్ని అందించేందుకు నిర్ణయించింది.


 ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు కార్యక్రమం ద్వారా ప్రస్తుతం ఎంతో మంది రైతులు పెట్టుబడి సాయాన్ని పొందుతున్నారు. అయితే ప్రతి పంటకు కూడా ఈ పెట్టుబడి సాయం ప్రస్తుతం రైతులకు ఖాతాల్లో నేరుగా జమ అవుతుంది అనే విషయం తెలిసిందే.   ప్రభుత్వం అందిస్తున్న ఈ పెట్టుబడి సాయం రైతులకు ఓ రకంగా  చేయూత నిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే రైతు బంధు కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు రైతుబంధు సాయం ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తూ ఉండేది.



 ఇక ఈ పంటకు సంబంధించి రైతుల బ్యాంకు ఖాతాల్లో  రేపటినుంచి రైతుబంధు సొమ్ము జమ కానుంది.  అయితే సాధారణంగా రైతు బందు రైతుల అకౌంట్లో జమ అయిన తర్వాత రైతులు బ్యాంకు లేదా ఏటీఎం కు వెళ్లి డబ్బులు డ్రా చేసుకునేందుకు అవకాశం ఉండేది కానీ ఇక  నుంచి రైతులు అంతలా శ్రమించాల్సిన అవసరం లేదు. రైతుబంధు డబ్బులు పొందేందుకు బ్యాంకు ఏటీఎం కు వెళ్లాల్సిన పనిలేదు.. నేరుగా రైతుల చేతికి డబ్బులు అందేవిధంగా తపాలా శాఖ ఏర్పాట్లు చేసింది. పోస్ట్ ఆఫీస్ లోని మైక్రో ఎటిఎంల ద్వారా రైతుబంధు పొందేందుకు అవకాశం ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ సిబ్బందికి సమాచారమిస్తే ఇంటికి వచ్చి రైతుబంధు సొమ్మును విత్ డ్రా  చేసి ఇస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: