ఇక ఓటమి తర్వాత పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది అని చెప్పొచ్చు.. జగన్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు పరిస్థితి ఎంత దీనంగా తయారైంది అందరికి తెలిసిందే.. కరోనా కారణంగా అయన బయటకి రాకుండా పార్టీ ని గాలికి వదిలేశారు.. దాంతో టీడీపీ భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. చంద్రబాబు టీడీపీ పార్టీ ఎంత హీనంగా తయారైందంటే పార్టీ ఇక పై భవిష్యత్ లో అధికారంలోకి రావడం కష్టంగా కనిపిస్తుంది.. ఒకవేళ రాధికారంలోకి రావాలనుకుంటే మాత్రం మూడు రాజధానులు జై కొట్టాల్సిందే.. లేదంటే టీడీపీ ఇక బ్రతికి బట్టకట్టదు..
ప్రస్తుతం ఏపీలో సంక్షేమం మరింత ఊపందుకుంది. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంతో ఎక్కడ చూసినా కోలాహలమే కనిపిస్తోంది. మూడు రోజులుగా ఆ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది. 15 రోజుల పాటు పండగలా నిర్వహిస్తామని తొలిరోజే సీఎం జగన్ ప్రకటించారు. ఆ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు అందరూ ఆ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. వీలైనంతర త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా లబ్దిదారులు అందరికీ పట్టాలు అందజేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే అంతంత మాత్రమే ఉన్న పార్టీ పరిస్థితి ఇళ్ల స్థలాల కార్యక్రమం ప్రారంభంతో గందరగోళంలో పడింది. ఇప్పటి వరకూ పేదలకు ఇళ్లు అందకపోవడానికి టీడీపీయే కారణమని విపరీతంగా ప్రచారం జరుగుతోంది. అది కూడా పార్టీకి నష్టం కలిగించింది. ఇలా ఏ రకంగా చూసినా ఏపీలో టీడీపీ గ్రాఫ్ పడిపోతుండడం చంద్రబాబు సహా నేతలందరికీ ‘‘క్షామ’కరంగా మారింది.