ప్రస్తుతం ఎంతో మంది అధికంగా డబ్బు సంపాదించాలి అని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం డబ్బు సంపాదించాలి అనుకున్న వారికి ఎన్నో రకాలమార్గాలు  కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎంతో మంది వివిధ మార్గాలలో అధికంగా డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే చేతిలో ఉన్న కొంత డబ్బుతోనే అదిరిపోయే లాభం పొందాలని ఆలోచించే వారికి ఎన్నో రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ రాబడి తోనే ఎక్కువ ఆదాయం పొందాలనుకునే వారికి మ్యూచువల్ ఫండ్స్ అనువుగా ఉంటుంది.



 మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు పెట్టడం వల్ల దీర్ఘకాలంలో మంచి రాబడి పొందే అవకాశం ఉంటుంది.  అయితే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి అంటే లాభనష్టాలను భరించే లాగా ఉండాలి. అంతే కాకుండా ఎంతో సహనంగా వేచిచూడాలి.  చిన్న మొత్తం లోనే కళ్ళు చెదిరే లాభాన్ని సొంతం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే కేవలం ఒక్కసారి మాత్రమే కాకుండా ప్రతి నెల డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది. అలా చేసినప్పుడు మాత్రమే మ్యూచువల్ ఫండ్స్ లో మంచి లాభం పొందేందుకు అవకాశం ఉంటుంది.


 ఇక మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు పెట్టి భారీగా డబ్బు సంపాదించుకోవాలి  అనుకునేవారికి.. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో మ్యూచువల్ ఫండ్స్ డబ్బు లు పెడుతూ వెళ్లాలి.  ప్రతినెలా వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేసినా సరిపోతుంది. వెయ్యి రూపాయలతో కోటీశ్వరుడు అయ్యేందుకు కూడా అవకాశం ఉంటుంది. అయితే ఇందుకోసం దీర్ఘకాలికంగా డబ్బులు పెడుతూ వెళ్లాలి.  ఉదాహరణకి మీరు ప్రతి నెల ₹1000 మ్యూచువల్ ఫండ్స్ లో  ఇన్వెస్ట్ చేసినట్లయితే.. 40 ఏళ్ల వరకు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.. అలా అయితే మీ చేతికి 1.18 కోట్ల వరకు వస్తుంది. ఇక వార్షిక రాబడిని 12 శాతంగా పరిగణలోకి తీసుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: