అంతేకాదు ప్రస్తుతం చైనాకు చెందిన ప్రతినిధులు అందరూ వచ్చి ప్రస్తుతం నేపాల్ లో ఓలి శర్మ తో కూర్చుని మరి చర్చలు జరుపుతూ ఉండడంతో అటు నేపాల్ ప్రజలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ నేత అయిన ప్రచాండ కంటే ఓలి శర్మ కే చైనా మద్దతు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో... దీన్ని అడ్డం పెట్టుకుని చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్నాడు ఓలి శర్మ. ఇలాంటి క్రమంలోనే ఆగ్రహంతో రగులుతున్నటువంటి ప్రజలు నిప్పు పై పెట్రోల్ రాసినట్టుగా ఉవ్వేత్తున ఎగిసిపడుతూ ప్రభుత్వం కి వ్యతిరేకంగా ఉద్యమ బాట పడుతున్నారు.
చైనా ప్రతినిధులు వచ్చి కూర్చొని నేపాల్ పాలన ఎలా ఉండాలి అనేది డిసైడ్ చేస్తున్న నేపథ్యంలో దీన్ని అస్సలు సహించని నేపాల్ ప్రజలు రోడ్లెక్కి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు తక్షణమే నేపాల్ లో పార్లమెంటు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూన్నారు. అయితే ప్రస్తుతం ప్రజలు చేస్తున్న ఉద్యమం లో అటు ఓలి శర్మ కు సంబంధించిన సొంత పార్టీ నేతలు కూడా పాల్గొంటూ ఉండటం అనేది మరింత సంచలనం గా మారిపోయింది. ఇక ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజల నుంచి తిరుగుబాటు తీవ్రమయ్యే అవకాశం ఉంది కాబట్టి చైనా ప్రోద్భలంతో ఈ తిరుగుబాటును అణిచి వేయాలని ఓలి శర్మ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తిరుగుబాటు వెనుక ఉన్నది భారత్ అని అటు చైనా ఓలి శర్మ భావిస్తున్నట్లు తెలుస్తోంది.