ఇటీవలే 50 ఏళ్ల వివాహిత పై అత్యా చారం హత్యయత్నం  ఘటన కలకలం సృష్టించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమం లోనే అనుమానితుడు గా ఉన్న రాము అనే వ్యక్తిని అరెస్టు చేసి విచారించగా ఇటీవలే సదరు వ్యక్తి నేరం  అంగీకరించినట్లు తెలుస్తోంది. హైదరాబాదు లో తీవ్ర సంచలనం కలిగించిన ఈ ఘటన పోలీసు విచారణ లో ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.  వివరాల్లోకి వెళితే..  మూసాపేట కు చెందిన 50 ఏళ్ల బాధితురాలు..  గత కొంతకాలం క్రితం భర్తతో మనస్పర్థలు రావడం తో విడిగా ఉంటుంది. తన తల్లితో కలిసి ఉంటుంది.


అయితే ఈనెల 25వ తేదీన పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్నా సదరు మహిళ పై కన్నేసిన రాము అనే వ్యక్తి.. ఇంటి దగ్గర దిగాబెడతాను అంటూ మాయ మాటలు చెప్పాడు.  అతని మాటలు నమ్మిన సదరు మహిళ చివరికి అతని వాహనం పై ఎక్కింది.  ఇక ఈ క్రమం లోనే నిర్మానుష్య ప్రాంతం లో కి బైక్ తీసుకెళ్ళిన రాము అనే వ్యక్తి మహిళ మెడలో ఉన్న మంగళసూత్రం ఇవ్వాలి అంటూ మహిళను బెదిరింపులకు పాల్పడ్డాడు. కానీ మంగళసూత్రం ఇచ్చేందుకు సదరు మహిళ నిరాకరించింది.



 ఈ క్రమంలోనే ఆమె పై కన్నేసిన రాము ఇక బలవంతంగా ఆమెపై అత్యాచారం చేయడంతో పాటు బండరాయితో ఆమె తలపై మోదాడు.  ఆ తర్వాత చనిపోయిందని భావించి అక్కడి నుంచి మంగళసూత్రం లాక్కొని పరారయ్యాడు. ఈ క్రమంలోనే అపస్మారక స్థితి నుంచి తేరుకున్న బాధితురాలు మరుసటిరోజు పోలీస్ స్టేషన్కు చేరుకుని పోలీసులకు జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసింది. పోలీసులు రామును అరెస్టుచేసి విచారణ జరిపారు.  ఇక పోలీసు విచారణలో రాము అన్ని నిజాలను ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: