కరోనా వైరస్ పుట్టుకకు కారణం చైనా అని అందరూ ఆదేశాన్ని ఇప్పటికీ తితికిపోస్తూనే ఉన్నారు. ఏడాదికి పైగా ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు, అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆర్థికంగా అన్ని దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. దీనంతటికీ కారణం చైనాలో పుట్టిన కరోనా వైరస్ కారణం అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతున్నా, దాని నుంచి ఇప్పుడిపుడే ప్రపంచం కోలుకుంది. అయినా ప్రపంచ దేశాలన్నీ ఇప్పటికీ చైనా ను తిట్టి పోస్తూనే వస్తున్నాయి. ఇదిలా ఉంటే బ్రిటన్ లో కనిపించిన కొత్త రకం కరోనా వైరస్ ఇప్పుడు చైనాకు పాకడంతో చైనా గజగజలాడిపోతోంది. కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ తాజాగా చైనాలో ఎంట్రీ ఇచ్చినట్లు చైనా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.



 షాంగై  తొలి కేసు వెలుగులోకి వచ్చింది. 23 సంవత్సరాల ఓ విద్యార్థినికి ఈ కరోనా వైరస్ స్ట్రెయిన్ లక్షణాలు కనిపించినట్లు ప్రభుత్వం పేర్కొంది. షాంగై కు చెందిన ఆమె బ్రిటన్ లో చదువుకుంటున్నారు .కిందటి నెల డిసెంబర్ 24న ఆమె బ్రిటన్ నుంచి చైనాకు వచ్చారు. అనంతరం అనారోగ్యానికి గురికావడం, కరోనా లక్షణాలు కనిపించడంతో అనారోగ్యానికి గురయ్యారు. అప్పటి నుంచి హోమ్ క్వారైటైన్ లో గడుపుతున్నారు.అయితే ఆమె ఆరోగ్యం కుదుట పడకపోగా మరింత అనారోగ్యానికి గురి కావడంతో అధికారులు ఆ విద్యార్ధి రక్త నమూనాలను సేకరించి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కు తరలించారు. అక్కడ ఆమెకు కొత్తరకం కరోనా వైరస్ స్ట్రెయిన్ సోకినట్లు వైద్య అధికారులు గుర్తించారు. ఇప్పటికే వివిధ దేశాలను వణికిస్తున్న వైరస్ ఇప్పుడు చైనాకు పాకడంతో ఎక్కడ ఈ వైరస్ దేశవ్యాప్తంగా విస్తరిస్తుంధో అని చైనా టెన్షన్ పడిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: