నందమూరి కుటుంబం నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి బాలకృష్ణనే. గత రెండు పర్యాయాల నుంచి ఆయన టీడీపీ నుంచి హిందూపురం ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. అయితే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కూడా బాలయ్య, రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండటం చాలా తక్కువ. తన పి‌ఏల ద్వారా హిందూపురంలో పనులు చేయిస్తూ, తాను ఎక్కువగా సినిమాలు, బసవ తారకం క్యాన్సర్ హాస్పటల్ పనులు చూసుకుంటారు.

ఇక బాలయ్య ఇలాగే కంటిన్యూ అవుతారా?అనే ప్రశ్న నందమూరి అభిమానులు నుంచి వస్తుంది.  అయితే బాలయ్య పరిస్తితి చూస్తే అది నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే బాలయ్యకు చంద్రబాబు ముందే చెక్ పెట్టేశారని చెప్పొచ్చు. బాలయ్య కుమార్తెని కోడలిని చేసుకుని, నందమూరి ఫ్యామిలీ నుంచి తమకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకున్నారు. అందుకే చంద్రబాబు తర్వాత పార్టీని నడిపించేది నారా లోకేష్ అని క్లియర్‌గా అర్ధమైపోయింది.

2014 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచే లోకేష్‌కు పెత్తనం ఇవ్వడం మొదలుపెట్టారు. అలాగే ఆయన్ని మంత్రి కూడా చేశారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయాక కూడా లోకేష్‌నే పార్టీని లీడ్ చేస్తున్నారు. చంద్రబాబు ఇంటికే పరిమితం అవుతుండటంతో లోకేష్ లీడ్ తీసుకుని ముందుకెళుతున్నారు. భవిష్యత్‌లో లోకేష్‌ టీడీపీ అధ్యక్షుడు అవుతాడు కాబట్టే, ఈ రకంగా బాబు వ్యూహం రచించుకుని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇక అల్లుడుకు పెత్తనం వస్తే బాలయ్యకు పోయిదేమీ లేదు. అందుకే బాలయ్య ఎమ్మెల్యేగా ఉన్నా సరే ఏపీ రాజకీయాలపై పెద్దగా స్పందించడం లేదు. ఎక్కువగా దేవుళ్ళని కొలిచే బాలయ్య, దేవాలయాలపై దాడులు జరిగినా మాట్లాడటం లేదు. ఆయన ఎక్కువ సినిమాలు, హాస్పటల్ పనులు మాత్రమే చూసుకుంటున్నారు. అలాగే నియోజకవర్గంలో పరిస్థితులు గురించి తెలుసుకుంటున్నారు తప్పా, రాష్ట్ర రాజకీయాలపై పెద్దగా స్పందించడం లేదు. తాజాగా పొలిట్ బ్యూరో సమావేశం జరిగినా కూడా ఓ మెంబర్‌గా బాలయ్య రాలేదు. మొత్తానికైతే టీడీపీలో బాలయ్య పాత్ర పెద్దగా ఏమీలేదనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: