ఇక ఈ పథకంపై 7.6% వడ్డీని అందిస్తుంది. అదే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్), సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్లను పరిశీలిస్తే వీటిపై వరుసగా 7.1%, 7.4% వడ్డీ లభిస్తుంది. అయితే, సాధారణంగా ప్రతి మూడు నెలలకోసారి ఈ వడ్డీ రేట్లలో మార్పులు చేస్తుంది ప్రభుత్వం. అయితే, 2021 జనవరి నుంచి -మార్చి మధ్య కాలంలో మాత్రం దీని వడ్డీరేట్లలో ఎటువంటి మార్పులు చేయట్లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, సుకన్య సమృద్ధి యోజనపై అధిక వడ్డీ లభిస్తున్నప్పటికీ, పిల్లల కోసం ఆదా చేయడానికి ఇదొక్కటే ఉత్తమమైన పెట్టుబడి మార్గం కాదని నిపుణులు చెబుతున్నారు.
అయితే సుకన్య సమృద్ధి యోజనపై వడ్డీ రేటును ప్రభుత్వం నిర్ణయిస్తుంది. సహజంగా ఈ వడ్డీ రేట్లు ప్రతి మూడు నెలలకొకసారి మారుస్తుంది. ఈ స్కీమ్ కింద సంవత్సరానికి కనీస పెట్టుబడిగా రూ. 250, గరిష్టంగా రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. నిర్ణీత కాలంలో కనీస మొత్తాన్ని జమ చేయకపోతే, పోస్టాఫీసు ఆ అకౌంట్ ను "డిఫాల్ట్ అకౌంట్"గా పరిగణిస్తుంది. అయితే, డిఫాల్ట్ అయిన అకౌంట్లను అకౌంట్ ప్రారంభించిన తేదీ నుండి 15 సంవత్సరాలు పూర్తయ్యేలోపు పునరుద్ధరించుకోవచ్చు. మీ అమ్మాయికి 10 సంవత్సరాల కంటే తక్కువ వయసుంటేనే ఈ పథకంలో చేరే అవకాశం ఉంటుంది.
ఒక కుటుంబం గరిష్టంగా ఇద్దరు ఆడ పిల్లలకు మాత్రమే ఎస్ఎస్ఏ ఖాతా తెరవగలరు. ఇక అకౌంట్ విత్డ్రా విషయానికి వస్తే మీ అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాత లేదా పదవ తరగతి పూర్తయిన తర్వాత పైచదువుల కోసం లేదా వివాహం కోసం డబ్బు తీసుకోవచ్చు. అంతేకాక, సుకన్య సమృద్ధి అకౌంట్ తెరిచిన 5 ఏళ్ల తర్వాత మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే దీని నుంచి ఎగ్జిట్ కావచ్చు. ఆ సమయంలో 50% ఫండ్స్ మాత్రమే విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ గడువు 21 సంవత్సరాలు కనుక, పథకంలో ఎప్పుడు చేరినా సరే 21 ఏళ్ల తర్వాతే దీని ద్వారా సంపూర్ణ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది.