ఈ క్రమంలోనే ఎంతో మంది ప్రస్తుతం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అందిస్తున్న వివిధ రకాల పాలసీల ద్వారా ఎంతగానో ప్రయోజనం పొందుతున్నారు. ఇక ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ తమ కస్టమర్లకు శుభవార్త చెబుతున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్.. ఇటీవలే మరోసారి కీలక నిర్ణయం తీసుకొని పాలసీదారులు అందరికీ శుభ వార్త చెప్పింది. ఎంతోమంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో వివిధ రకాల పాలసీలు తీసుకొని ఇక ఆ తర్వాత అవి వివిధ కారణాలతో పాలసీ రద్దు కావడంతో నిరాశ చెందుతుంటారు అనే విషయం తెలిసిందే. అలాంటివారికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇటీవలే శుభ వార్త చెప్పింది.
ఒకవేళ పాలసీదారుల పాలసీలు వివిధ కారణాలతో రద్దయితే ఇక వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదని.. రద్దయిన పాలసీల పునరుద్ధరణ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. అయితే దీనిపై మార్చి 6వ తేదీ వరకు పాలసీదారుల అందరికీ అవగాహన కల్పించేందుకు నిర్ణయించింది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. మార్చి 6వ తేదీ వరకు కూడా రద్దయిన పాలసీల పునరుద్ధరణ చేసుకునేందుకు అవకాశం ఉంది అంటూ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తెలిపింది. ఇక గత ఏడాది కూడా ఎల్ఐసి పాలసీ దారులు అందరికీ రద్దయిన పాలసీల పునరుద్ధరణ చేసుకునేందుకు ఆగస్టు 10 నుంచి డిసెంబర్ 9 వరకు ఈ అవకాశాన్ని కల్పించింది అన్న విషయం తెలిసిందే.