టీడీపీలో యువ‌త మౌనంగా ఉన్నారు. లెక్క‌కు మిక్కిలిగా యువ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ.. ఎవ‌రూ దూకు డుగా ముందుకు రావ‌డం లేదు. మ‌రీ ముఖ్యంగా పార్టీ కీల‌క నాయ‌కుడు, భావి పార్టీ అధ్య‌క్షుడు నారా లోకే ష్ క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నా.. జిల్లాలు ప‌ట్టుకుని తిరుగుతున్నా.. యువత ఆయ‌న వెంట క‌ని పించ‌డం లేదు. దీనికి కార‌ణ‌మేంటి? ఎందుకిలా జ‌రుగుతోంది?  ఎవ‌రికి వారు ఎందుకు లోకేష్‌కు దూరం గా ఉంటున్నారు? అనే విష‌యాలు పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఇదే విష‌యంలో సీనియ‌ర్లు కూడా త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు.

నిజానికి టీడీపీ గ‌త ఎన్నిక‌ల్లోనే యువ‌త‌ను న‌మ్ముకుంది. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ త‌ర‌ఫున టికెట్లు కూడా ఇచ్చింది. అయితే.. ఒక్క ఆదిరెడ్డి భవానీ త‌ప్ప‌.. ఎవ‌రూ విజ‌యం సాధించ‌లేదు. ఆ త‌ర్వాత కూడా పార్టీలో యువ‌త కు ప్రాధాన్యం ఇస్తామ‌ని.. 33 శాతం ప‌ద‌వులు ఇస్తామ‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. అయి తే.. త‌ర్వాత ఏర్ప‌డిన పార్టీ క‌మిటీల్లో యువ‌త‌కు అవ‌కాశం క‌ల్పించినా.. ఆశించిన వారికి పెద్ద‌గా ప‌ద‌వులు ద‌క్క‌లేదు. ఇది ఒక కార‌ణ‌మే అయినా.. లోకేష్ వ‌చ్చినా.. పార్టీలో యువ‌త ముందుకు రాక‌పోవ‌డం వెనుక ప్ర‌ధాన రీజ‌న్‌.. రాజ‌కీయంగా లోకేష్ శైలి న‌చ్చ‌క‌పోవ‌డ‌మేన‌ని అంటున్నారు సీనియ‌ర్లు.

వాస్త‌వానికి లోకేష్ జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌ల‌కు వ‌స్తున్న స‌మాచారం ముందుగా సీనియ‌ర్లకు అందుతోంది. దీం తో వారే అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. అంతా సిద్ధ‌మైపోయిన త‌ర్వాత‌.. యువ‌త‌కు ప్రాధాన్యం ద‌క్కుతోంది. దీంతో అన్ని ఏర్పాట్లు తామే చేశామంటూ.. సీనియ‌ర్లు పార్టీకి నివేదిక స‌మ‌ర్పిస్తున్నారు. దీంతో త‌మ ప్ర‌మే యం లేన‌ప్పుడు తామెందుకు పార్టిసిపేట్ చేయాల‌న్న ధోర‌ణి ఒక‌వైపు ఉంది.

మ‌రో వైపు సీనియ‌ర్ల డామినేషన్ ఇంకా కొన‌సాగుతుండ‌డంతో యువ‌ నాయ‌కులు ఒకింత అస‌హ‌నానికి గుర‌వుతున్నారు. దీంతో లోకేష్ ప‌ర్య‌ట‌న‌ల‌కు డుమ్మా కొడుతున్నార‌నే చ‌ర్చ సాగుతోంది. పైకి యువ‌త‌కు ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని చెబుతున్నా.. త‌మ‌కు ప్రాధాన్యం లేకుండా పోతోంద‌న్న‌ది వారి వాద‌న‌. మ‌రి ఈ స‌మ‌స్య ఎప్ప‌టికి ప‌రిష్కారం అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: