ఇప్పటికే దాదాపు వంద శాతం పథకాలు అమలు చేసిన జగన్ ఇప్పుడు కొత్త కొత్త పథకాలను వెతికి ప్రజలకు మేలు చేయాలనీ చూస్తున్నారు. ఇకపోతే గత ప్రభుత్వం హయాంలో జరిగిన లోపాలను సరిదిద్దుతూ అయన బెస్ట్ సీఎం అనిపించుకున్నాడు. నిన్న విజయవాడ కృష్ణా నది తీరంలో 9 ఆలయాలను తిరిగి నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ ఆలయాలను కృష్ణా నది పుష్కరాల సమయంలో నాటి చంద్రబాబు ప్రభుత్వం కూల్చివేసింది. విజయవాడ నగరం, కృష్ణా నది పరివాహక ప్రాంతంలో దాదాపు 40 ఆలయాలను నాటి సీఎం చంద్రబాబు కూల్చివేశారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా ఆలయాలను తిరిగి నిర్మిస్తామని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చెప్పారు. చెప్పిన మాట ప్రకారం సీఎం జగన్.. ఈ రోజు తొలి విడతలో 9 ఆలయాలను పునర్ నిర్మించేందుకు భూమి పూజ చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు దేవాలయాల కూల్చివేతల గురించి చర్చలు జరుగుతున్న సమయంలో జగన్ ఇలా చేయడమం తో ప్రజలు ఆయన్ని దేవుడిలా చుస్తునారు. ఇక చంద్రబాబు కూల్చివేసిన దేవాలయాలను నేడు తిరిగి నిర్మిస్తోన్న సీఎం జగన్‌పై మాత్రం పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారు. 18 నెలలుగా ఎందుకు నిర్మించలేదనే తర్కం లేని విమర్శలు పవన్ చేస్తుండడం గమనార్హం.