దిగ్గజ దేశీయ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇటీవలే తమ కార్ల పై అదిరిపోయే ఆఫర్ ప్రకటించి కస్టమర్లను ఎంతగానో ఆకర్షిస్తోంది. మారుతి సుజుకి ఏరిన, నెక్స డీలర్ షిప్ వద్ద ఈ అదిరిపోయే ఆఫర్ ను సొంతం చేసుకునేందుకు అవకాశం ఉంది. వివిధ రూపాలలో ప్రస్తుతం భారీ తగ్గింపు అందిస్తుంది మారుతి సుజుకి. మారుతీ సుజుకీ ఎస్ ప్రెసో, సెలెరియో కార్లపై రూ.20 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ ఉంది. ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.20,000 బెనిఫిట్ లభిస్తుంది. వితారా బ్రెజా, స్విఫ్ట్, ఈకో మోడళ్లపై క్యాష్ డిస్కౌంట్ రూ.10 వేలుగా ఉండగా.. ఎక్స్చేంజ్ బోనస్ రూ.20 వేలు లభిస్తోంది. మారుతీ సుజుకీ ఎర్టిగా కారుపై రూ.4 వేల కార్పొరేట్ డిస్కౌంట్ ఉంది. డిజైర్ కారుపై రూ.8 వేల క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్ రూ.20,000 లభిస్తోంది. మారుతీ ఆల్టో 800 మోడల్‌పై రూ.15 వేల క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్ సొంతం చేసుకోవచ్చు.
మారుతీ ఎస్‌క్రాస్ సిగ్మా కారుపై ఎక్స్చేంజ్ బోనస్ రూ.20 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.10 వేలుతోపాటు రూ.37 వేల యాక్ససిరీస్ పొందొచ్చు. మారుతీ సియాజ్ కారుపై క్యాష్ డిస్కౌంట్ రూ.10 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.10 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ రూ.20 వేలు సొంతం చేసుకోవచ్చు..కేవలం మారుతి సుజుకి మాత్రమే కాదు నిస్సాన్ కూడా తన కార్లపై బంపర్ ఆఫర్ తో కస్టమర్లను ఆకర్షిస్తుంది. రూ.80 వేల వరకు తగ్గింపు అందిస్తోంది. క్యాష్ డిస్కౌంట్ కింద రూ.10,000, ఎక్స్చేంజ్ కింద రూ.50 వేల వరకు, లాయల్టీ బెనిఫిట్ కింద రూ.20 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. నిస్సాన్ కిక్స్ కారు కొనుగోలు చేస్తేనే ఈ ప్రయోజనాలు లభిస్తాయి.