తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా కంగారు పడుతున్నారు. గతంలో ఎప్పుడూ లేనంత టెన్షన్ కు గురవుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి కెసిఆర్ లో గణనీయమైన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. త్వరలోనే కేటీఆర్ ను సీఎం కుర్చీలో కూర్చో బెడతారనే ప్రచారం ఊపందుకుంటున్న సమయంలో దానికి తగ్గట్టుగానే పరిస్థితులను సానుకూలంగా మార్చే విషయంలో కెసిఆర్ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు. దాదాపు మార్చిలో కేటీఆర్ కు పట్టాభిషేకం చేసేందుకు అనువైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే 2022 లో జమి లి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం ముమ్మరంగా కసరత్తు మొదలుపెట్టిన తరుణంలో ఇప్పటి నుంచే కెసిఆర్  అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యేందకు ప్రయత్నాలు చేస్తున్నారు. 




ముఖ్యంగా ఉద్యోగస్తులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తూ వారి డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. తరచుగా ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ, ఉద్యోగుల పట్ల టిఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు సానుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. అలాగే కుల సంఘాల నాయకులతో ను సఖ్యతగా ఉంటూ , వారికి అన్ని రకాలుగాను సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు. పెద్ద ఎత్తున కుల సంఘాల భవనాల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేస్తూ, అన్ని కులాల్లోనూ టిఆర్ఎస్ కు బలం పెరిగే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఒకటి కాదు ప్రతి విషయంలోనూ సానుకూల వైఖరితో కెసిఆర్ ముందడుగు వేస్తున్నారు. గతంలో మీరు చూసిన కేసీఆర్ వేరు , ఇప్పుడు కెసిఆర్ వేరు అనే సంకేతాలను ఇస్తూ అందరివాడిగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం కెసిఆర్ లో వచ్చిన మార్పు పై తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కెసిఆర్ కు జెమిని ఎన్నికల కంగారు మొదలైందని, అందుకే ఇంత అకస్మాత్తుగా ప్రేమాభిమానాలు కురిపిస్తున్నారు అంటూ జనాల్లో చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: