మనదేశంలోని రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులంతా ఒక విధంగా వ్యవహరిస్తే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తారు. రాజకీయ పరంగా కూడా చాలా సాధారణంగా గడుపుతారు...లేని పోనీ హడావిడికి పోకుండా, సహజ సిద్ధంగా ఉంటారు. కొంత మంది సీఎంలు అయితే రాజకీయ పరంగా ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటారు. తన పాలన తన సాగిస్తూ ఉంటారు. అయితేం కొన్ని సంవత్సరాలుగా ఒడిశా రాష్ట్రంలో సీఎంగా కొనసాగుతున్నారు. అయితే  అక్కడున్న రాజకీయ నాయకులూ కూడా యనెను ఎదుర్కోలేని పరిస్థితి.  

ఇప్పుడు నవీన్ పట్నాయక్ తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. 2020 మార్చి 31 వరకు నాటికి రూ.64.98 కోట్లుగా తేల్చారు. కానీ దాని తరువాత ఇప్పటివరకు ప్రకటించిన ఆస్తుల వివరాలను పరిశీలిస్తే 9 నెలల కాలంలో కేవలం ఆస్తులు రూ.71 లక్షలు మాత్రమే పెరిగినట్లు చూపించారు. ఇందులో భువనేశ్వర్.. ఢిల్లీ.. ఫరీదాబాద్ లలో తన తండ్రి కమ్ మాజీ సీఎం బిజు పట్నాయక్.. తల్లి ద్వారా లభించిన ఆస్తులు మరియు రచయితగా రాయల్టీ రూపంలో తనకు వచ్చిన ఆదాయం మొత్తం కలిపితే రూ.63కోట్లుగా తెలిపారు. ఆ ఆస్తుల వివరాలను లోకాయుక్తకు ఇవ్వడం జరిగింది. మనదేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో ఎవ్వరికీ లేనంత పేరు ఈ సీఎం కి ఉంది.

ఇతనికి మంచి నిజాయితీపరుడిగా పేరుంది. ఇప్పటికీ ఈయన బ్రహ్మచారి జీవితాన్ని గడుపుతుండడం విశేషం. ఈ ఆస్తుల్లో ఆయనకు అత్యధిక విలువ ఉన్న ఆస్తిగా ఢిల్లీలోని తన తల్లి నివాసంలోని వాటా కాగా, ఇంకొకటి ఫరీదాబాద్ లోని టిక్రీఖేరా గ్రామంలో 22.7 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.దాని విలువ రూ.10కోట్లు. దీని బట్టి చూస్తే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తరువాత సంపాదించింది ఏమీ లేదనే చెప్పాలి. గత 20 సంవత్సరాలుగా ఒడిశాలో తిరుగులేని సీఎం గా తన రాజకీయ జీవితాన్ని గడుపుతున్నారు. ప్రజలకు మంచి పలను అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: