టీడీపీకి వీర విధేయుడుగా ఉంటూ, తన బాబాయ్ అచ్చెన్నాయుడుకు సపోర్ట్‌గా ఉంటున్నారు. అలాగే 2019 ఎన్నికల తర్వాత శ్రీకాకుళం జిల్లాలో పార్టీని తిరిగి నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయినా సరే, రామ్మోహన్ ఎంపీగా రెండోసారి గెలిచిన విషయం తెలిసిందే. ఇక గెలిచాక అటు పార్లమెంట్‌లో రాష్ట్రం కోసం పోరాడుతూనే, ఇక్కడ ఏపీలో పార్టీ కోసం కష్టపడుతున్నారు. తన బాబాయ్ అచ్చెన్నాయుడు జైలుకు వెళ్ళినా సరే బెదరకుండా అలాగే పార్టీ కోసం నిలబడ్డారు
ఇక అచ్చెన్న జైలు నుంచి రావడం, ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా బాధ్యతలు తీసుకున్నాక దూకుడుగా పనిచేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా రామ్మోహన్ తన పార్లమెంట్ పరిధిలో వైసీపీకి బాగానే డ్యామేజ్ చేస్తున్నారని తెలుస్తోంది. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిల్లో టెక్కలి, ఇచ్చాపురం నియోజకవర్గాలు టీడీపీవే. అయితే మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక వాటిల్లో కూడా పట్టు దక్కేలా రామ్మోహన్ ముందుకెళుతున్నారట.
ఇప్పటికే పలాస, పాతపట్నం, ఆమదాలవలస నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు దూకుడుగా పనిచేస్తున్నారు. గౌతు శిరీష, కలపట వెంకటరమణ, కూన రవి కుమార్‌లు వైసీపీ ఎమ్మెల్యేలకు ధీటుగా పనిచేస్తున్నారు. శ్రీకాకుళం, నరసన్నపేట స్థానాల్లో కూడా టీడీపీ పుంజుకునేలా రామ్మోహన్ వ్యూహాలు రచిస్తూ ముందుకెళుతున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ పుంజుకున్నట్లు కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో 7 స్థానాలు గెలిచి సత్తా చాటాలని రామ్మోహన్ చూస్తున్నారు. మొత్తానికైతే శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో రామ్మోహన్, వైసీపీకి బాగానే నష్టం చేసినట్లు కనిపిస్తోంది.