అన్ని రంగాలకు కోట్లు కేటాయించే ప్రభుత్వ పెద్దలు విద్య విషయంలో చిన్న చూపూ చూస్తూనే ఉంటారు. అంతెందుకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో పిల్లల శాతం తగ్గిపోతూ కార్పొరేట్ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరగడం కూడా ఇందుకు కారణం. ఇక మనదేశంలో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో రాష్ట్రాలు విద్యలో వెనకపడి ఉన్నాయి. అయితే ఈ రాష్ట్రాలకు భిన్నంగా ఏపీలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం విద్యకు ఖర్చు చేసే నిధుల విషయంలో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది.
దేశంలోనే అత్యధికంగా ఇప్పటిదాకా కేరళలో 90.9 శాతం అక్షరాస్యత ఉంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం 22వ స్థానంలో ఉండడం బాధాకరం. సమైక్య పాలనలోనూ, చంద్రబాబు పాలనలోనూ విద్యా పరంగా ఏపీకి ఒరిగిందేమీ లేదనే చెప్పాలి. అయితే జగన్ సీఎం అయినప్పటి నుంచి విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నారు. అమ్మ ఒడి ద్వారా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా... భావి భారత భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకునేందుకు ఎన్నో ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు.
గత ఏడాది కంటే ఈ ఏడాది అమ్మ ఒడి లబ్దిదారులు మరింత పెరగడం జగన్ లక్ష్య శుద్ధికి అద్దం పడుతోందనే చెప్పాలి. విద్యాభివృద్ధి కోసం జగన్ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వస్తుందనే చెప్పాలి. ఇక జగన్ ప్రభుత్వం అమలు చేస్తోన్న వలంటీర్ వ్యవస్థను కూడా ఇప్పుడు దేశంలో పలు రాష్ట్రాలు గమనిస్తున్నాయి.