ఇక మినుముల్లో పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మన ఎముకలను దృఢంగా మారుస్తాయి. మినుములతో చేసిన పదార్థాలకు క్రమం తప్పకుండా తీసుకునేవారు ఆస్టియోపోరోసిస్, ఎముకలకు సంబంధించిన ఇతర అనారోగ్యాలకు దూరంగా ఉంటారు. మినుముల్లో ఉండే సూక్ష్మ పోషకాలు ఎముకల సాంద్రతను మెరుగుపరుస్తాయి.
అంతేకాక మినుముల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర, గ్లూకోజ్ స్థాయులను నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇవి డయాబెటిస్‌ను దూరం చేస్తాయి. ఇప్పటికే డయాబెటిస్ సమస్య ఉన్నవారు క్రమం తప్పకుండా మినుములతో చేసిన పదార్థాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పెరగకుండా కాపాడుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు.
అయితే మినుముల నుంచి పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్త నాళాలు, ధమనుల్లో ఏర్పడే ఒత్తిడిని తగ్గించడానికి పొటాషియం సహాయపడుతుంది. అందువల్ల మినుములతో చేసిన పదార్థాలను తీసుకునేవారు రక్తపోటు, ఇతర గుండె సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
మినుముల్లో రెండు రకాల పీచుపదార్థాలు ఉంటాయి. ఇక వీటిల్లో ఉండే కరిగే ఫైబర్... ఆహారం నుంచి శరీరం పోషకాలను గ్రహించడానికి సహాయపడుతుంది. కరగని ఫైబర్ తీసుకున్న ఆహారం సక్రమంగా అరిగేలా చేస్తుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తూ అనారోగ్యాలకు దూరంగా ఉంచుతాయి. మినుముల్లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కడుపులో మంట, నొప్పులను తగ్గిస్తాయి. వీటిని ముద్దగా చేసి నొప్పి ఉండే కండరాలు, కీళ్లపై మర్దన చేసుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం ఉంటుంది.