ప్రస్తుతం ప్రధాన నగరాల్లో వినపడుతున్న మాట వ్యభిచారం.. అందంగా ఉన్న యువతకు డబ్బు ఆశ చూపించి వ్యభిచార కూపంలోకి లాగుతున్నారు.ఈ ముఠాలపై పోలీసుల దాడులు ఎక్కువ అయ్యాయని కొత్త మార్గాలను ఎంచుకున్నారు. సాప్ట్ వేర్ ను వాడుకొని విటులను ఆకర్షిస్తున్నారు. ఈ వ్యవహారం మొత్తం గుట్టుగా సాగుతుంది. హైదరాబాద్లో ఈ దందా రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో ఇప్పుడు రూట్లు మార్చుకున్నారు. స్పా , సెలూన్ పేర్లతో జోరుగా వ్యభిచారాన్ని కొనసాగిస్తున్నారు.. పోలీసులు ఎప్పటికప్పుడు దాడులు చేస్తున్నా కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి.. ఈ విషయం పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..


వివరాల్లోకి వెళితే..ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నగరం నడిబొడ్డున సెలూన్ అండ్ స్పా మాటున గుట్టుగా సాగుతున్న వ్యభిచార దందా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నెల్లూరు నగరంలోని దర్గామిట్ట లోని ప్లాటినమ్ సెలూన్‌లో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టయింది. గురువారం దర్గామిట్ట లోని సెలూన్ పై పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు..


ఈ మేరకు కోల్‌కత్తాకు చెందిన యువతితో పాటు, బెంగాల్ కు చెందిన యువతులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.. సెలూన్ లో యువతి తో పాటు విటుడిని పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. నెల్లూరు నగరం నడిబొడ్డున సెలూన్ మాటున ఇంతకాలంగా జోరుగా వ్యభిచారం జరుగుతున్న విషయం తెలుసుకుని నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కోల్‌కత్తా నుంచి యువతులను తీసుకొచ్చి గుట్టుగా సాగిస్తున్న ఈ దందా ఒక్కసారిగా బయటపడటం తో షాక్‌ తిన్నారు. పోలీసుల విచారణలో గత కొద్ది రోజులుగా సెలూన్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తేలింది. నిందితులను పోలీసులు అరెస్టు చేసి వారిని స్టేషన్‌కి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.. ఇలాంటి వ్యభిచారం చేయిస్తున్న స్పా లు నగరంలో చాలానే ఉన్నాయని, వాటి పై కూడా దాడి చేస్తామని పోలీసులు తెలిపారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: