ఏపీలో ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడుల అంశం రాజకీయ రంగాన్ని వెడెక్కెలా చేసి సర్వత్రా చర్చకు దారితీసింది. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ పై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. క్రైస్తవ మతాన్ని కార్నర్  చేస్తూ పెద్దయెత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మతాల మధ్య అగ్గిరాజుకునేలా గతంలో వ్యాఖ్యలు చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దేవుళ్ల విగ్రహాలు ఫేక్ అంటూ  ప్రచారం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన కాకినాడకు చెందిన పాస్టర్ ప్రవీణ్‌ చక్రవర్తి అనే వ్యక్తిని  పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

దేవుళ్ల విగ్రహాలను తాను ధ్వంసం చేశానని, ధ్వంసం చేయించానని అలా విరగొట్టిన విగ్రహాలను కాలితో తన్నానని పలు ఘాటు వ్యాఖ్యలతో  ఓ యూట్యూబ్ ఛానల్‌లో ప్రవీణ్ చేసిన పోస్టు వైరల్ గా మారడంతో...గుంటూరు వాసి లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ పోలీసులు పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తిని అరెస్ట్ చేయడంతో ఇలా కటకటాల పాలయ్యాడు ప్రవీణ్. ప్రవీణ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఇది ఏడాది క్రితం పోస్టైన వీడియో కావడం గమనార్హం.
అయితే ఇపుడు తాజాగా ఈ అంశం అటు తిరిగి ఇటు తిరిగి చివరకు వైసీపీ చుట్టూ అల్లుకుంటోంది.

ఈ కేసులో చిక్కుకున్న వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ కి వైసీపీ కి సంభందాలు ఉన్నాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బావ బ్రదర్ అనిల్ కుమార్‌తో సంబంధాలు ఉన్నాయని టీడీపీ నేత, మాజీ హోంమంత్రి చినరాజప్ప అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ విషయం పై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశం ఇపుడు ఏపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బావ ‘బ్రదర్ అనిల్‌’ ను కార్నర్ చేయగా ఆయన ఇపుడు ఇందులో చిక్కుకుపోయాడు. ఇది వైసీపీని కేంద్రం గా చేసే కోణంలో చినరాజప్ప ఆరోపణలు చేయడం రాజకీయంగా దుమారం రేగింది.

ఈ విషయం పై వైసీపీ ఎలా స్పందించనుందో చూడాలి. మరోవైపు పోలీసులు విగ్రహాలు ధ్వంసం చేసిన కేసుపై విచారణను వేగవంతం చేసింది. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తూ వీలైనంత త్వరగా కేసును ఓ కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆలయాలపై విగ్రహ ధ్వంసం జరుగుతున్న ఘటనల తెరవెనుక  రాజకీయ పార్టీల హస్తం ఉందంటూ  ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. అందులో టీడీపీ, బీజేపీ నేతల హస్తం ఉందని తెలిపారు. ఈ కేసులో భాగంగా అనుమానితులు అయిన  13 మంది టీడీపీ నేతలు, ఇద్దరు బీజేపీ నేతలను అరెస్ట్‌ చేసినట్లు డీజీపీ సవాంగ్‌ వెల్లడించారు. ఇలా  వారిపై తీవ్ర ఆరోపణలు చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. మరి ఇప్పుడు ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: