
ఇక రాచరిక వ్యవస్థలో రాజులు ఎంత చెప్తే అన్న విధంగా అన్న విధంగా ఉంటుంది పరిస్థితి. ఈ క్రమంలోనే ఎంతో మంది ఉద్యోగులు ప్రజలు కూడా రాచరిక వ్యవస్థతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అక్కడి రాజులను ప్రశ్నించే, విమర్శించే ధైర్యం మాత్రం ఎవ్వరిలోనూ ఉండదు. కానీ ఇటీవల ఒక మాజీ మహిళా ప్రభుత్వ ఉద్యోగి.. థాయిలాండ్ మహా రాజు తో పాటు అక్కడ రాచరిక వ్యవస్థను తీవ్రంగా విమర్శిస్తూ అవమానించింది. అయితే మహిళ అక్కడి మహారాజును అవమానిస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం సంచలనంగా మారిపోయింది.
అయితే మాజీ మహిళా ప్రభుత్వ ఉద్యోగి ఇలా థాయిలాండ్ మహారాజు తో పాటు రాచరిక వ్యవస్థను కూడా అవమానిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం, వ్యతిరేకంగా ప్రచారం చేయడం ను అక్కడి కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే ఆ మహిళ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు ఏకంగా నలభై మూడు సంవత్సరాలపాటు జైలుశిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. మొదట సదరు మహిళకు ఈ కేసులో 87 ఏళ్ల జైలు శిక్ష విధించగా ఆ మహిళ తర్వాత నేరం అంగీకరించింది. దీంతో ఆమెకు విధించిన 87 ఏళ్ల జైలు శిక్షను కాస్త 43 ఏళ్ల కు కుదించింది కోర్టు.