ప్రస్తుతం రోజురోజుకు క్రెడిట్ కార్డు వాడకం ఎంతలా పెరిగిపోతుందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ప్రస్తుతం సామాన్యులు ధనికులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డు వినియోగిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.  ఇక ఆయా బ్యాంకులు కూడా తమ కష్టమర్లందరికీ క్రెడిట్ కార్డు అందించేందుకు సిద్ధమయ్యాయి. అంతేకాకుండా క్రెడిట్ కార్డు ద్వారా  ఆకర్షనీయమైన ఆఫర్లను  ప్రకటిస్తూ..  క్రెడిట్ కార్డు వాడకానికి మరింత ప్రోత్సాహం అందిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.  అయితే ప్రస్తుతం దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు గా కొనసాగుతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ కస్టమర్లకు క్రెడిట్ కార్డ్ సర్వీస్ అందిస్తోంది.



 అయితే ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ అనుబంధ సంస్థ అయిన ఎస్బిఐ కార్డు  అందిస్తున్న క్రెడిట్ కార్డులతో పలు రకాల ప్రయోజనాలు పొందేందుకు అవకాశం ఉంది.  అయితే ఈ కార్డు లలో  ఆర్ సి టి సి రూపే ఎస్బిఐ కార్డు కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ట్రైన్ జర్నీ ఎక్కువగా చేసేవారికి ఈ కార్డు ఎంతో అనువుగా ఉంటుంది. ఈ కార్డు  తీసుకోవడం వల్ల పలు రకాల ప్రయోజనాలు కూడా పొందేందుకు అవకాశం ఉంది. ఈ కార్డు ద్వారా ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటే పది శాతం వరకు వాల్యూ బ్యాక్ లభిస్తోంది. అయితే ఎస్బిఐ ఈ సరికొత్త క్రెడిట్ కార్డును గత ఏడాదే మార్కెట్లోకి తీసుకువచ్చింది అన్న విషయం తెలిసిందే.



 అయితే  క్రెడిట్ కార్డు వాడే వారు ఏడాదికి ఐదు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు క్రెడిట్ కార్డు తీసుకోవడానికి ముందుగా జాయినింగ్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. కానీ  ప్రస్తుతం రూపే క్రెడిట్ కార్డు ఉచితంగానే పొందేందుకు కస్టమర్లకు అవకాశం ఉంది. ఎలాంటి జాయినింగ్ ఫీజు కూడా ఉండదు. అయితే ఈ ఆకర్షణీయమైన ఆఫర్ కేవలం మార్చి 31 వరకు మాత్రమే కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రెడిట్ కార్డు తీసుకోవడం వల్ల ఐ‌ఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా ట్రైన్ టికెట్లు బుక్ చేస్తే ట్రాన్సాక్షన్ చార్జీ 1 శాతం పడదు. వెల్‌కమ్ గిఫ్ట్ కింద 350 బోనస్ పాయింట్లు వస్తాయి. భాగస్వామ్య వెబ్‌సైట్లలో కొనుగోలు చేస్తే డిస్కౌంట్లు ఉంటాయి. రూ.500కు పైగా వాహనాలకు ఇంధనం పట్టిస్తే సర్‌చార్జ్ చెల్లించాల్సిన పని లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: